కరోనా ఎఫెక్ట్ : క్షీణించిన జీఎస్టీ వసూళ్లు 

1 Aug, 2020 17:00 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా, లాక్‌డౌన్ సంక్షోభంతో జీఎస్టీ వసూళ్లు భారీగా క్షీణించాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం పన్ను వసూళ్లు జూలై మాసంలో 87,422 కోట్ల రూపాయలకు  పడిపోయాయి. గత ఏడాది (జూలై 2019) ఇదే కాలలో 1.02 లక్షల కోట్లను రాబట్టింది. గత ఏడాదితో పోలిస్తే ఆదాయం 14.36 శాతం క్షీణించింది. జూన్ నెలలో 90,917 కోట్ల రూపాయలతో పోలిస్తే జూలైలో వసూలు 3.84 శాతం క్షీణించింది.  (అయిదేళ్లలో 12 లక్షల ఉద్యోగాలు)

2020 జూలైలో వసూలు చేసిన స్థూల జీఎస్టీ ఆదాయం, 87,422 కోట్ల రూపాయలు. ఇందులో సీజీఎస్టీ 16,147 కోట్లు, ఎస్‌జీఎస్టీ 21,418 కోట్లు, ఐజీఎస్టీ 42,592 కోట్లు, సెస్ 7,265 కోట్లుగా ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం 86 శాతం అని పేర్కొంది. గత నెలలో వచ్చిన ఆదాయాలు ప్రస్తుత నెల కంటే ఎక్కువగా ఉన్నాయి. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 2020 లకు సంబంధించిన పన్నులను జూన్ నెలలో పెద్ద సంఖ్యలో పన్ను చెల్లింపుదారులు చెల్లించారని పేర్కొంది. అలాగే 5 కోట్ల కంటే తక్కువ టర్నోవర్ ఉన్న పన్ను చెల్లింపుదారులు 2020 సెప్టెంబర్ వరకు రిటర్నులను దాఖలు చేసేందుకు సడలింపు ఉన్న విషయాన్ని గమనించాలని మంత్రిత్వ శాఖ తెలిపింది. (వాహన కొనుగోలుదారులకు ఊరట)

మరిన్ని వార్తలు