Jyothy Lab Result: జ్యోతి ల్యాబ్స్‌ లాభం ప్లస్‌

25 May, 2022 02:26 IST|Sakshi

క్యూ4లో రూ. 37 కోట్లు 

షేరుకి రూ. 2.5 డివిడెండ్‌ 

న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో ఎఫ్‌ఎంసీజీ కంపెనీ జ్యోతి ల్యాబ్స్‌ పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 35 శాతం జంప్‌చేసి రూ. 37 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది (2020–21) ఇదే కాలంలో రూ. 27 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 10 శాతం ఎగసి రూ. 547 కోట్లకు చేరింది.

అయితే మొత్తం వ్యయాలు 15 శాతం పెరిగి రూ. 508 కోట్లను తాకాయి. వాటాదారులకు షేరుకి రూ. 2.5 చొప్పున డివిడెండు ప్రకటించింది. కాగా.. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన పూర్తి ఏడాదికి జ్యోతి ల్యాబ్స్‌ నికర లాభం 17 శాతం క్షీణించి రూ. 159 కోట్లకు పరిమితమైంది. 2020–21లో రూ. 191 కోట్లు ఆర్జించింది. మొత్తం అమ్మకాలు మాత్రం 15 శాతంపైగా వృద్ధితో రూ. 2,196 కోట్లను అధిగమించాయి. 
ఫలితాల నేపథ్యంలో జ్యోతి ల్యాబ్స్‌ షేరు బీఎస్‌ఈలో 1.5 శాతం బలపడి రూ. 150 వద్ద ముగిసింది. 

మరిన్ని వార్తలు