Karan Adani: అదానీ కీలక నిర్ణయం: కరణ్‌ అదానీ చేతికి ఏసీసీ పగ్గాలు

17 Sep, 2022 04:02 IST|Sakshi

ఏసీసీ, అంబుజా సిమెంట్స్‌ కొనుగోలు పూర్తి

డైరెక్టర్‌గా గౌతమ్‌ అదానీ పుత్రుడికి బాధ్యతలు

బోర్డుల పునర్వ్యవస్థీకరణపై అదానీ గ్రూప్‌ వెల్లడి

న్యూఢిల్లీ: స్విస్‌ సిమెంట్‌ దిగ్గజం హోల్సిమ్‌కు చెందిన ఇండియా బిజినెస్‌ల కొనుగోలును పూర్తి చేసినట్లు అదానీ గ్రూప్‌ వెల్లడించింది. తద్వారా ప్రపంచ కుబేరుడు గౌతమ్‌ అదానీ గ్రూప్‌ దేశీయంగా రెండో అతిపెద్ద సిమెంట్‌ దిగ్గజంగా ఆవిర్భవించింది. 

కాగా అదానీ పెద్దకుమారుడు కరణ్‌కు ఏసీసీ బాధ్యతలు అప్పగించినట్లు గ్రూప్‌ తాజాగా పేర్కొంది. 6.5 బిలియన్‌ డాలర్లకు హోల్సిమ్‌ నుంచి సొంతం చేసుకున్న తదుపరి ఏసీసీ, అంబుజా సిమెంట్స్‌ వాటాదారులకు ఓపెన్‌ ఆఫర్లను పూర్తి చేసినట్లు తెలిపింది. అదానీ గ్రూప్‌ టేకోవర్‌ పూర్తయిన వెంటనే రెండు కంపెనీల బోర్డు డైరెక్టర్లు రాజీనామాలు చేసినట్లు వెల్లడించింది. (Gautam Adani: దూకుడు మామూలుగా లేదుగా! ఏకంగా బెజోస్‌కే ఎసరు)

గౌతమ్‌ అదానీ అధ్యక్షతన
గ్రూప్‌ వ్యవస్థాపక చైర్మన్‌ గౌతమ్‌ అదానీ అంబుజా సిమెంట్స్‌కు అధ్యక్షత వహించ నున్నారు. ప్రస్తుతం పోర్టు బిజినెస్‌లు చూస్తున్న కరణ్‌ అదానీ ఏసీసీ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు.  పీఎస్‌యూ దిగ్గజం ఎస్‌బీఐ మాజీ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ అంబుజా బోర్డులో, ఇంధన దిగ్గజం షెల్‌ ఇండియా మాజీ హెడ్‌ నితిన్‌ శుక్లా ఏసీసీ బోర్డులో స్వతంత్ర డైరెక్టర్లుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అంబుజా సీఈవోగా అజయ్‌ కుమార్, ఏసీసీ సీఈవోగా శ్రీధర్‌ బాలకృష్ణన్‌ వ్యవహరించనున్నారు. (Gold Price: ఫెస్టివ్‌ సీజన్‌లో గుడ్‌ న్యూస్‌)

ఇదీ చదవండిHero Motocorp: విడా ఈవీ,తొలి మోడల్‌ కమింగ్‌ సూన్‌

మరిన్ని వార్తలు