నెట్‌ఫ్లిక్స్‌, కరన్‌జోహార్‌ బంధానికి ఎండ్‌కార్డ్‌

22 Sep, 2021 14:53 IST|Sakshi

Karan Johar Ended His Deal With Netflix: నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైన లస్ట్‌ స్టోరీస్‌ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. లస్ట్‌ స్టోరీస్‌తో మొదలైన బాలీవుడ్‌ ఏస్‌ డైరెక్టర్‌ కరణ్‌ జోహార్‌ , నెట్‌ఫ్లిక్స్‌ బంధానికి తెరపడింది.
2019 నుంచి
ఇండియాలో మార్కెట్‌ విస్తరణలో భాగంగా నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ ఒరిజనల్ కంటెంట్‌ అందించేందుకు కరణ్‌ జోహార్‌కు చెందిన ధర్మా ప్రొడక‌్షన్స్‌తో 2019లో జత కట్టింది. దీని ప్రకారం ధర్మా ప్రొడక‌్షన్‌ హౌజ్‌కి చెందిన ధర్మాన్‌ నుంచి వచ్చే అన్ని వెబ్‌ సిరీస్‌లు నెట్‌ఫ్లిక్స్‌లోనే ప్రసారం చేయాల్సి ఉంటుంది.


లస్ట్‌ స్టోరీస్‌
కరణ్‌ జోహార్‌, నెట్‌ఫ్లిక్స్‌ ఒప్పందంలో భాగంగా వచ్చిన లస్ట్‌ స్టోరీస్‌ దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒక్కసారిగా నెట్‌ఫ్లిక్స్‌కి చందాదారుల సంఖ్య అమాంతం పెరిగింది. ఆ తర్వాత ఘోస్ట్‌ స్టోరీస్‌ కూడా మంచి ఆదరణ దక్కించుకుంది. మొత్తంగా ఎంటర్‌టైన్మెంట్‌ విభాగంలో ఈ రెండు సంస్థలు రెండేళ్ల పాటు పని చేశాయి. 


ఇక చాలు
రెండేళ్ల కాంట్రాక్టు ముగిసిన తర్వాత దాన్ని పొడిగించేందుకు కరణ్‌ జోహార్‌ ఆసక్తి చూపించలేదు. తమ ధర్మ ప్రొడక‌్షన్‌ హౌజ్‌ నుంచి వచ్చె వెబ్‌ సిరస్‌లను ఒకే ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌కే పరిమితం చేసేందుకు ఆయన సుముఖంగా లేరు. దీంతో రెండేళ్ల పాటు కలిసి చేసిన ప్రయాణానికి పులిస్టాప్‌ పెట్టేశారు. మరోవైపు ధర్మా ప్రొడక‌్షన్‌ హౌజ్‌కి సంబంధించిన సినిమాలు ఎక్కువగా అమెజాన్‌ ప్రైమ్‌వీడియోస్‌, డిస్నీ హాట్‌స్టార్‌లో ఎక్కువగా రిలీజ్‌ అవుతున్నాయి. 


విస్తరిస్తున్న ఓటీటీ
ఇండియాలో ఓటీటీ మార్కెట్‌ శర వేగంగా విస్తరిస్తోంది. లీడింగ్‌లో ఉన్న అమెజాన్‌ ప్రైమ్‌కి ప్రస్తుతం 1.80 కోట్ల మంది సబ్‌‍స్క్రైబర్లు ఉండగా ఈ ఏడాది చివరి నాటికి 2.10 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు 2021 డిసెంబరు నాటికి  46 లక్షల మంది చందాదారులున్న నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ దాన్ని 55 లక్షలకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. హాట్‌స్టార్‌, జీ 5, సోనీ, వూట్‌, ఆల్ట్‌ బాలాజీలు సరైతం చందాదారులను ఆకట్టుకునేందుకు వెబ్‌ సిరీస్‌, కొత్త సినిమా రిలీజ్‌పై దృష్టి పెట్టాయి. 


లాభసాటి వ్యవహారం
ఓటీటీలకు యూత్‌ మహారాజ పోషకులుగా ఉన్నారు. దీంతో యూత్‌ను ఆకట్టుకునే వెబ్‌ సిరీస్‌లు నిర్మించే సంస్థలకు మంచి ఆఫర్లు ఇస్తున్నాయి. దీంతో ఒక్కో వెబ్‌ సిరీస్‌ని ఒక్కో ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌పై రిలీజ్‌ చేయడం ద్వారా ఇటు ఆర్థికంగా లాభసాటిగా ఉండటంతో పాటు బ్రాండ్‌ వాల్యూ కూడా పెరుగుతుందనే యోచనలో కరణ్‌ జోహార్‌ ఉన్నారు. అందువల్లే నెట్‌ఫ్లిక్స్‌కి బై చెప్పారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
చదవండి : సమంతకు నెట్‌ఫ్లిక్స్‌ భారీ ఆఫర్‌.. వైరల్‌ అవుతోన్న రెమ్యునరేషన్‌!

మరిన్ని వార్తలు