కార్వీ స్కామ్‌: భారీగా ఆస్తులు స్వాధీనం

30 Jul, 2022 16:26 IST|Sakshi

కార్వీ స్కామ్‌:  రూ110  కోట్ల ఆస్తులు  ఎటాచ్‌

హైదరాబాద్‌: కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ (కెఎస్‌బీఎల్) సంస్థకు చెందిన కోట్ల రూపాయల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్‌ చేసింది. కార్వీ సీఎండీ పార్థసారథి  ఇతరులపై మనీ లాండరింగ్ విచారణకు సంబంధించి రూ.110 కోట్లకు పైగా విలువైన  ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ శనివారం తెలిపింది. 

కార్వీ స్కామ్‌లో  మనీలాండరింగ్ యాక్డ్‌ కింద కార్వీపై ఇప్పటికే కేసు నమోదు చేసిన ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. దీంతో ఈ కేసులో ఈడీ ఆస్తుల అటాచ్‌మెంట్ మొత్తం విలువ రూ.2,095 కోట్లకు చేరుకుంది. ఇందులో షేర్లు, భూములు, భవనాల షేర్లు, విదేశీ కరెన్సీ, బంగారు ఆభరణాలు   ఉన్నాయి. 

కాగా దాదాపు రూ. 2,800 కోట్ల విలువైన తమ ఖాతాదారుల షేర్లను అక్రమంగా తాకట్టు పెట్టి కార్వీ గ్రూప్ పెద్ద మొత్తంలో రుణాలు పొందిందని, ఆ రుణాలు నిరర్ధక ఆస్తులుగా మారాయని ఆరోపిస్తూ రుణాలిచ్చిన బ్యాంకుల ఫిర్యాదులపై హైదరాబాద్ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా మనీలాండరింగ్ కేసు నమోదైంది. విచారణలో భాగంగా ఈ ఏడాది జనవరిలో పార్థసారథి  గ్రూప్ సీఎఫ్‌వో జి కృష్ణ హరిని అరెస్టు చేసింది. ఇద్దరూ ఇప్పుడు బెయిల్‌పై  ఉన్న సంగతి  తెలిసిందే.

మరిన్ని వార్తలు