ఈ కంపెనీ బైక్‌ ధరలు మరింత ప్రియం..!

26 Jul, 2021 20:37 IST|Sakshi

ప్రముఖ రేసింగ్‌ బైక్ల తయారీదారు కవాసకీ పలు ఏంపిక చేయబడిన బైక్ల ధరలను గణనీయంగా పెంచనుంది. 2021 ఆగష్టు 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. ఎంపిక చేయబడిన పలు బైక్‌ల కొత్త ధరలను కవాసకి ఇండియా ప్రకటించింది.  ఎంట్రీ లెవల్ బైక్ల ధరల్లో కవాసకి ఏలాంటి మార్పు చేయలేదు. మిడిల్‌వెయిట్,  లీటర్-క్లాస్ బైక్‌ల ధరలు గణనీయంగా పెరగనున్నాయి. మోడల్‌ను బట్టి 6000 నుంచి రూ.15,000 వరకు కవాసాకి బైక్‌ ధరలు పెరిగాయి.  ఈ త్రైమాసికంలో ధరలను పెంచిన మొదటి ప్రీమియం బైక్ తయారీదారుగా కవాసాకి నిలిచింది.

పలు కవాసకి బైక్ల నూతన ధరలు
మోడల్‌ ప్రస్తుత ధర ఆగస్టు 1 నుంచి కొత్త ధర వ్యత్యాసం
కవాసకి నింజా 650 రూ.6.54లక్షలు రూ. 6.61 లక్షలు రూ. 7000
కవాసకి జెడ్‌ 650 రూ.6.18లక్షలు రూ. 6.24 లక్షలు రూ. 6000
కవాసకి వెర్సిస్ 650 రూ.7.08 లక్షలు రూ. 7.15 లక్షలు     రూ. 7,000
కవాసకి వల్కాన్ ఎస్ రూ. 6.04 లక్షలు రూ.  6.10 లక్షలు రూ. 6,000
కవాసకి డబ్య్లూ800 రూ. 7.19 లక్షలు రూ. 7.26 లక్షలు రూ.7,000
కవాసకి జెడ్900 రూ. 8.34 లక్షలు రూ. 8.42 లక్షలు రూ. 8,000
కవాసకి నింజా 1000 ఎస్ఎక్స్ రూ. 11.29 లక్షలు రూ. 11.40 లక్షలు రూ. 11,000
కవాసకి నింజా జెడ్‌ఎక్స్ -10 ఆర్ రూ. 14.99 లక్షలు రూ. 15.14 లక్షలు రూ. 15,000
కవాసకి వెర్సిస్ 1000 రూ. 11.44 లక్షలు రూ. 11.55 లక్షలు రూ.11,000
Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు