జోస్‌ ఆలుక్కాస్‌ ప్రచార కర్తగా కీర్తి సురేష్‌

19 Apr, 2021 00:18 IST|Sakshi

హైదరాబాద్‌: ఆభరణాల విక్రయ సంస్థ జోస్‌ ఆలుక్కాస్‌ తన బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రముఖ నటి, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్‌ను నియమించుకుంది. దక్షిణాది సినిమా రంగంలో అత్యధిక ప్రజాదరణ కలిగిన కీర్తి... సంస్థ ప్రకటనల్లో నటించి తమ ఉత్పత్తులను కొత్త కస్టమర్లకు మరింత చేరువ చేస్తుందని కంపెనీ ఆశిస్తోంది. సంస్థ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా ఈ ఏడాది పలు రాష్ట్రాల్లో కొత్త షోరూంలను ప్రారంభిస్తామని జోస్‌ ఆలుక్కాస్‌ ఒక ప్రకటనలో తెలిపింది. తమ సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా  కీర్తి సురేష్‌ సేవలు  దీర్ఘకాలం కొనసాగాలని సంస్థ ఆకాంక్షిస్తున్నట్లు ప్రకటన వివరించింది. జోస్‌ ఆలుక్కాస్‌ వంటి ప్రతిష్టాత్మక సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమి తులుకావడం గర్వకారణమని కీర్తి పేర్కొంది.

మరిన్ని వార్తలు