Benda V302C: కీవే కొత్త బైక్‌ చూశారా? ధర సుమారు రూ. 4 లక్షలు

31 Aug, 2022 16:19 IST|Sakshi

సాక్షి,ముంబై: బైక్‌మేకర్ కీవే బెండా వీ302 సీ బైక్‌ను భారత మార్కెట్లోవిడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 3.89 లక్షల (ఎక్స్-షోరూమ్). అధీకృత బెనెల్లీ/కీవే డీలర్‌షిప్‌ల వద్ద అందుబాటులో ఉంటుంది. ఆసక్తి ఉన్న వినియోగదారులు రూ.10,000 చెల్లించి కీవే వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో  ఈ బైక్‌ను బుక్ చేసుకోవచ్చు. ఈ బైక్‌   గ్లోసీ గ్రే, గ్లోసీ బ్లాక్ , గ్లోసీ రెడ్  అనే మూడు రంగులలో లభిస్తుంది.

బెండా వీ302 సీ ఇంజీన్‌ను పరిశీలిస్తే 298cc, ట్విన్ సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ను అమర్చింది. ఇది గరిష్టంగా 29.5hp శక్తిని ,26.5Nm గరిష్ట టార్క్‌ను  ప్రొడ్యూస్‌ చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో పాటు,  డిస్క్ బ్రేక్స్‌, మెరుగైన హ్యాండ్లింగ్ కోసం డ్యూయల్-ఛానల్ ఏబీఎస్‌ తో వస్తుంది.

డిజైన్‌ విషయానికి వస్తే స్టెప్-అప్ సింగిల్-పీస్ సౌకర్యవంతమైన సీటు, విస్తృత హ్యాండిల్ బార్, వైడ్‌ రియర్‌ వీల్‌, బైక్ ట్యాంక్‌ కెపాసిటీ 15 లీటర్ల ఇంధనాన్ని నిల్వ చేయగలదు. అలాగే వీల్స్‌అన్నింటికీ -LED లైటింగ్ సెటప్‌ను  అందించింది.

ప్రస్తుతం, కీవే చైనీస్ మోటార్‌సైకిల్ తయారీదారు కియాన్‌జియాంగ్ గ్రూప్‌లో భాగం.  బెనెల్లీ కూడా దీని సొంతమే.  1999లో వచ్చిన  కీవే  98 దేశాలలో దాని ఉత్పత్తులను అందిస్తోంది.  బెనెల్లీ సిస్టర్‌ కంపెనీ కీవే మే 2022లో మూడు కొత్త ఉత్పత్తుల ద్వారా దేశీయ మార్కట్లోకి ప్రవేశించింది. కీవే కె-లైట్ 250V, కీవే వియెస్టే 300  కీవే సిక్స్టీస్ 300iబైక్స్‌ను  ఇక్కడ తీసుకొచ్చింది. 

మరిన్ని వార్తలు