దేశీయంగా కీవే బైక్స్‌ తయారీ: లక్కీ కస్టమర్లకు భారీ ఆఫర్‌

22 Jun, 2023 10:44 IST|Sakshi

సూపర్‌బైక్స్‌ బ్రాండ్‌ కీవే ఎస్‌ఆర్‌ 250, ఎస్‌ఆర్‌ 125 మోడళ్ల తయారీని దేశీయంగా ఈ ఏడాది నుంచి చేపట్టనున్నట్టు ఆదీశ్వర్‌ ఆటో రైడ్‌ ఇండియా ప్రకటించింది. ఇటీవలే ప్రీమియం సెగ్మెంట్‌లో నాన్-రెట్రో మోటార్‌సైకిళ్లను ప్రవేశపెట్టింది కీవే. 

ఢిల్లీఎక్స్‌షోరూంలో పరిచయ ఆఫర్‌ ధర ఎస్‌ఆర్‌ 250 రూ.1.49 లక్షలు వద్ద అందుబాటులో ఉంటుంది.  రూ.2,000కి బుక్ చేసుకోవచ్చు. ఇక ఎస్‌ఆర్‌ 125 రూ.1.19 లక్షలుగా  ఉంది.  కేవలం 1000కే  బుక్‌ చేసుకోవచ్చు. వినియోగదార్లు దేశవ్యాప్తంగా ఉన్న 55 బెనెల్లి, కీవే షోరూంలు లేదా ఆన్‌లైన్‌లో ఈ బైక్స్‌ను  కొనుక్కోవచ్చు. 

కీవే ఎస్‌ఆర్‌ 250 తొలి  500 డెలివరీల కోసం ప్రత్యేకంగా ఒక ప్రత్యేక లక్కీ డ్రాను ప్రకటించారు. ఈ లక్కీ డ్రాలో, ఐదుగురు లక్కీ కస్టమర్‌లు కీవే ఎస్‌ఆర్‌ ఎక్స్-షోరూమ్ ధరపై 100 శాతం క్యాష్‌బ్యాక్‌ను గెలుచుకునే అవకాశం ఉంటుంది. అంతేనా దీనికి అదనంగా , AARI 'My SR My Way' అనే కొత్త ప్లాట్‌ఫారమ్‌ను పరిచయం చేస్తోంది. 

కీవే  ఎస్‌ఆర్‌ 125  బెస్ట్‌ మైలేజీ సామర్థ్యాన్ని కోరుకునే  బైక్‌ లవర్స్‌కు ఇది   బెస్ట్‌ ఆప్షన్‌. 125 సీసీ 4-స్ట్రోక్ ఎలక్ట్రానిక్ ఫ్యూయల్-ఇంజెక్షన్ పెట్రోల్ ఇంజన్ ఇందులో అమర్చారు. ఇది  గరిష్టంగా 9.7hp శక్తిని 8.2nm గరిష్ట టార్క్ అందిస్తుంది.  ఇంకా హాలోజన్ హెడ్‌ల్యాంప్, LCD కలర్ డిస్‌ప్లే, కాంబి-బ్రేకింగ్ సిస్టమ్ , డ్యూయల్-పర్పస్ టైర్స్‌ 1 ఉంది.  బ్రేకింగ్  సిస్ఠంలో 300ఎంఎం ఫ్రంట్‌ డిస్క్, వెనుకవైపు 210ఎంఎ డిస్క్‌ను అందించింది. బైక్‌కు 160ఎంఎ గ్రౌండ్ క్లియరెన్స్‌తో పాటు, అడ్జస్టబుల్ రియర్ సస్పెన్షన్ లభిస్తుంది.

మరిన్ని వార్తలు