రూ.4.5లక్షల ఎలక్ట్రిక్‌ కారు, 5 రూపాయలకే 60కిలో మీటర్ల ప్రయాణం!

13 Apr, 2022 18:38 IST|Sakshi

టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుంది. దీంతో అద్భుతమైన కొత్త కొ​త్త ఆవిష్కరణలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కేరళ కొల్లాంకు చెందిన 67 ఏళ్ల ఆంటోనీ జాన్ ఎలక్ట్రిక్‌ కారును తయారు చేసుకున్నాడు. రెండు సీటర్ల కారును సింగిల్‌ ఛార్జ్‌ పెట్టి కేవలం రూ.5 ఖర్చుతో 60 కిలోమీటర్ల మీటర్ల దూరం ప్రయాణించవచ్చని తెలిపారు. 

రూ.4.5లక్షలు ఖర్చు 
జాన్ 2018లో పుల్కూడు పేరుతో రూ.4.5 లక్షల వ్యయంతో జాన్‌ ఈ కారును డిజైన్‌ చేశారు. ఎలక్ట్రిక్ కారులో ఇద్దరు ప్రయాణికులు ప్రయాణించొచ్చు.ఇక పిల్లల కోసం ప్రత్యేకంగా కారు వెనుక భాగంగా ఒక చిన్నసీటును డిజైన్‌ చేశారు. ఇది గరిష్టంగా గంటకు 25 కిలోమీటర్ల డ్రైవింగ్ వేగంతో వెళుతుందని జాన్‌ తెలిపారు.

 

2018లో ఎలక్ట్రిక్‌ కారు తయారీ 
జాన్‌ 67 ఏళ్ల కెరీర్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నారు. అయితే జాన్‌ గతంలో తన ఇంటి నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఆఫీస్‌కు వెళ్లేందుకు ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను ఉపయోగించాడు. కఠినమైన వాతావరణ౦,సౌకర్య౦, సెక్యూరిటీ కోస౦, జాన్ ఎలక్ట్రిక్ కారును డిజైన్‌ చేశాడు. 2018లో ఎలక్ట్రిక్‌ కారు కోసం శోధించారు. కారు బాడీ డిజైన్ కోసం ఒక గ్యారేజీకి ఇచ్చాడు. అదే సమయంలో వైరింగ్ చేసి, సర్క్యూట్ ను తానే స్వయంగా తయారు చేశాడు.

కారు కోసం బ్యాటరీలు, మోటారు, వైరింగ్ను ఢిల్లీలో  కొనుగోలు చేశాడు. హెడ్ లైట్, ఫాగ్ లైట్, ఇండికేటర్, ఫ్రంట్..బ్యాక్ వైపర్లు వంటి ముఖ్యమైన ప్రాథమిక ఫీచర్లతో ఎలక్ట్రిక్‌ కారు పనిచేస్తుంది. కాగా ప్రస్తుతం ఈ కారు పనితీరు బాగుండడంతో మరో ఎలక్ట్రిక్‌ కారును తయారు చేసేందుకు జాన్‌ సిద్ధమయ్యారు.

మరిన్ని వార్తలు