కియా నుంచి మరో కొత్త మోడ‌ల్‌, కారు ధ‌ర, ఫీచ‌ర్లు ఎలా ఉన్నాయంటే!

6 Feb, 2022 15:34 IST|Sakshi

కార్ల త‌యారీ సంస్థ కియా ఇండియా  భారత్‌ నుంచి ఒక లక్ష కార్ల ఎగుమతి మార్క్‌ను క్రాస్ చేసి స‌రికొత్త రికార్డ్‌ల‌ను క్రియేట్ చేసిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు అదే జోరులో కియా మ‌రిన్ని కొత్త మోడ‌ళ్ల‌ను మార్కెట్‌కు ప‌రిచ‌యం చేయ‌నుంది.   

 ఈనెల 15న దేశీయ మార్కెట్‌లో కియా కారెన్స్‌ను లాంఛ్ చేయ‌నున్న‌ట్టు కంపెనీ ప్ర‌క‌టించింది. ఈ కారును  కంపెనీ వెబ్‌సైట్‌తో పాటు డీల‌ర్ల వ‌ద్ద రూ 25,000 చెల్లించి కియా కారెన్స్‌ను బుక్ చేసుకోవ‌చ్చ‌ని ఆ సంస్థ ప్ర‌తినిధులు తెలిపారు. 
  

కియా కారెన్స్‌ ఫీచ‌ర్లు 
 6,7 సీట్ల‌లో ల‌భించే కియా కారెన్స్ కారులో  స్ల్పిట్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్‌, డీఆర్ఎల్స్‌, వంటి ఫీచ‌ర్ల‌తో ప్రీమియం, ప్రెస్టీజ్‌, ప్రెస్టీజ్ ప్ల‌స్‌, ల‌గ్జ‌రీ, ల‌గ్జ‌రీ ప్ల‌స్ వంటి ఐదు ట్రిమ్స్‌లు ఈ కారులో అందుబాటులో ఉండ‌నున్నాయి. వీటితో పాటు  బాస్ స్పీక‌ర్ సిస్ట‌మ్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎయిర్ ప్యూరిఫైర్‌, డౌన్‌హిల్ బ్రేక్ కంట్రోల్‌, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్‌లు, 10.25 ఇంచ్ ఇన్ఫోటెయిన్మెంట్ స్క్రీన్‌, ఫుల్లీ డిజిట‌ల్ ఇనుస్ట్రుమెంట్ ప్యానెల్, సింగిల్ పేన్ స‌న్‌రూఫ్‌, 64 క‌ల‌ర్ యాంబియంట్ లైటింగ్‌, వంటి ఫీచ‌ర్లు ఉన్నాయి. కాగా ఈ  ఇక కియా కారెన్స్ రూ 12 ల‌క్ష‌ల నుంచి రూ 18 ల‌క్ష‌ల వ‌ర‌కూ అందుబాటులో ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు