-

Kia Carens భారీ రీకాల్‌, కారణం ఏమిటంటే..!

6 Oct, 2022 12:33 IST|Sakshi

సాక్షి, ముంబై: ప్రముఖ కార్ల కంపెనీ కియా తన పాపులర్‌ మోడల్‌ కియా కేరెన్స్ కార్లను  భారీగా రీకాల్‌ చేస్తోంది. ఎయిర్‌బ్యాగ్ సమస్య కారణంగా దాదాపు 44,174 ఎంపీవీ యూనిట్లు రీకాల్ చేసింది. ఎయిర్‌బ్యాగ్ కంట్రోల్ మాడ్యూల్ సాఫ్ట్‌వేర్‌లో లోపాలను  పరిశీలించనుంది.

6 ఎయిర్‌బ్యాగ్స్‌ అందిస్తున్న కియా కేరెన్స్‌ కార్ల స్వచ్ఛంద రీకాల్‌లో అవసరమైతే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌తో ఎయిర్‌బ్యాగ్ సమస్యను కంపెనీ పరిష్కరించ నుంది. ఇందులో భాగంగా ప్రభావితమైన కారు యజమానులను నేరుగా సంప్రదిస్తుంది. లేదంటే సమస్యను పరిష్కరించేందుకు వీలుగా  కియా కేరెన్స్‌ యజమానులు తమ కారును  సమీపంలోని కియా డీలర్‌షిప్‌ల వద్దకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. లేదా కియా ఇండియా వెబ్‌సైట్, యాప్ లేదా వారి కాల్ సెంటర్‌లో గానీ సంప్రదించవచ్చు. (Akasa Air ఆఫర్‌: వారి సంబరం మామూలుగా లేదుగా!)

కాగా గ్లోబల్‌ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌లో కియా కేరెన్స్‌  3-స్టార్‌ ర్యాంక్‌ సాధించింది.1.5 పెట్రోల్, 1.4 లీటర్ టర్బో పెట్రోల్,  1.5 లీటర్ డీజిల్ మూడు వేరియంట్లలో ఇది లభ్యం. 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్,  8-స్పీకర్లు, స్మార్ట్ ప్యూర్ ఎయిర్ ప్యూరిఫైయర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అలాగే ప్రీమియం, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ, లగ్జరీ ప్లస్‌ అనే 5 ట్రిమ్‌లలో  ఇది లభ్యం. అన్నింటిలోనూ  6 ఎయిర్‌బ్యాగ్స్‌, 10 హై-సేఫ్టీ ప్యాకేజీలు కూడా  అందింస్తున్న సంగతి తెలిసిందే.  (జావా అదిరిపోయే కొత్త బైక్‌ చూశారా? ధర కూడా అంతే అదుర్స్‌)

మరిన్ని వార్తలు