Kia Anantapur Plant: కియా డేరింగ్‌ స్టెప్‌.. ఇక నో వెయిటింగ్‌

1 Mar, 2022 08:39 IST|Sakshi

అనంతలో ఉత్పత్తి పెంచిన కియా 

హైదరాబాద్, బిజినెస్‌బ్యూరో: వాహన తయారీ సంస్థ కియా ఇండియా ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్‌ ప్లాంటులో మూడవ షిఫ్ట్‌ ప్రారంభించింది. దీంతో 3 లక్షల యూనిట్ల పూర్తి వార్షిక సామర్థ్యానికి ఉత్పత్తిని పెంచింది. 2019 ఆగస్ట్‌లో ఈ ప్లాంటులో కార్ల తయారీ మొదలైంది. ఇప్పటి వరకు కంపెనీ దేశీయంగా నాలుగు లక్షల కార్లను విక్రయించింది. అలాగే మధ్యప్రాచ్య, ఆఫ్రికా, మధ్య, దక్షిణ అమెరికా, మెక్సికో, ఆసియా పసిఫిక్‌ వంటి 91 దేశాలకు ఒక లక్ష కార్లను ఎగుమతి చేసింది.

కియా కార్లపై వెయిటింగ్‌ పీరియడ్‌ను తగ్గించడానికి, దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో అధిక డిమాండ్‌ నేపథ్యంలో.. వనరులను సమకూర్చుకున్నామని, అదనపు సిబ్బందిని నియమించామని కియా ఇండియా ఎండీ, సీఈవో టే జిన్‌ పార్క్‌ ఈ సందర్భంగా తెలిపారు. ‘ప్రపంచవ్యాప్తంగా కియాకు భారత్‌ వ్యూహాత్మక మార్కెట్‌. మా ఉత్పత్తులన్నింటికీ ఇక్కడ అద్భుతమైన స్పందన లభించింది’ అని అన్నారు.

చదవండి: Kia India-AP: కియా అనంత ప్లాంట్‌ కొత్త రికార్డ్‌ 

మరిన్ని వార్తలు