Kia India: భారత మార్కెట్లలో కియా మోటార్స్‌ ప్రభంజనం..!

3 Jan, 2022 18:10 IST|Sakshi

భారత ఆటోమొబైల్‌ మార్కెట్లలో సరికొత్త రికార్డులను సృష్టిస్తూ నమ్మకమైన ఆటోమొబైల్‌ కంపెనీగా కియామోటార్స్‌ నిలుస్తోంది. దక్షిణ కొరియాకు చెందిన ఈ కంపెనీ భారత్‌లో దిగ్గజ ఆటోమొబైల్‌ కంపెనీలకు సవాల్‌ను విసురుతోంది. 2021గాను కియా మోటార్స్‌ అనూహ్యమైన అమ్మకాలను భారత్‌లో జరిపింది. 

అమ్మకాల్లో 29 శాతం వృద్ధి..!
కియా మోటార్స్‌ 2021గాను మొత్తంగా  2,27,844 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇందులో దేశీయంగా 1,81,583 యూనిట్లను కియా సేల్‌ చేసింది. సరఫరా, చిప్స్‌ కొరత ఉన్నప్పటికీ 2020తో పోలిస్తే 2021 దేశీయ విక్రయాలలో 29శాతం వృద్ధిని కియా మోటార్స్‌ నమోదు చేసింది. 2021గాను భారత మార్కెట్లో 6 శాతం మార్కెట్‌ వాటాను కియా మోటార్స్‌ సొంతం చేసుకుంది. ఈ ఏడాదిలో భారత్‌లోని మొదటి ఐదు కార్ల సంస్థల్లో కియా  నిలిచింది. 

డిసెంబర్‌లో అదరగొట్టిన సెల్టోస్‌..!
2021 డిసెంబర్‌లో కియా మోటార్స్‌లో సెల్టోస్‌ కార్లు అత్యధికంగా అమ్ముడైనాయి. గత నెలలో కియా మోటార్స్‌ 7,797 యూనిట్ల అమ్మకాలను జరిపింది.వీటిలో సెల్టోస్‌ 4,012 యూనిట్లతో అగ్ర భాగంలో నిలిచాయి. సోనెట్ మోడల్స్‌ 3,578 యూనిట్లు, కార్నివాల్ 207 యూనిట్లను కియా మోటార్స్‌ విక్రయించింది. 

ఎగుమతుల్లో కమాల్‌..!
భారత్‌లో కియా మోటార్స్‌ను స్థాపించినప్పటి నుంచి సుమారు 96,242 యూనిట్లను ఇతర దేశాలకు కంపెనీ ఎగుమతి చేసింది. 2021గాను 46,261 యూనిట్లను ఇతరదేశాలకు పంపిణీ చేసింది. 2020తో పోలిస్తే 2021లో ఎగుమతుల్లో 23 శాతం వృద్ధిని కియా సాధించింది. భారత్‌ నుంచి సుమారు 90 దేశాలకు కార్లను ఎగుమతి చేసింది. 

సెల్టోస్‌ రెండు లక్షలు..,సెనోట్‌ ఒక లక్ష..!
ఇప్పటివరకు కియా మోటార్స్‌ సుమారు 2 లక్షలకు పైగా సెల్టోస్‌ మోడళ్లను, ఒక లక్షకు పైగా సోనెట్‌ వాహనాలను కంపెనీ విక్రయించింది. 

చదవండి: హ్యుందాయ్‌కు గట్టి షాకిచ్చిన టాటా మోటార్స్‌..!

మరిన్ని వార్తలు