కియా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది.. ఫీచర్స్ అదుర్స్!

2 Aug, 2021 18:33 IST|Sakshi

సియోల్: దక్షిణ కొరియాకు చెందిన రెండో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ కియా తన తొలి ఎలక్ట్రిక్ కారును నేడు(ఆగస్టు 2న) ఆవిష్కరించింది. ఆల్ ఎలక్ట్రిక్ ఈవీ6 సెడాన్ గా పేరున్న ఈ ఎలక్ట్రిక్ కారును కొరియాలో 40,800 డాలర్ల నుంచి 49,500 డాలర్లకు తీసుకొని వచ్చింది. దేశీయ మార్కెట్లో కియా ఈవీ6 కోసం 30,000కు పైగా ప్రీఆర్డర్లను, యూరప్ & అమెరికాలో కలిపి 8,800 ప్రీఆర్డర్లను అందుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఏడాదిలోపు దక్షిణ కొరియాలో 3,000 యూనిట్లను, విదేశీ మార్కెట్లలో 17,000 యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు యోన్హాప్ వార్తా సంస్థ పేర్కొంది. ఈ ఏడాది చివరినాటికి  ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొనిరానున్నట్లు కంపెనీ తెలిపింది. 

ప్రభుత్వ సబ్సిడీలతో కలిపి 34,761 డాలర్ల(రూ.25 లక్షల) కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు అని తెలిపింది. ఈ ఈవీ6 మోడల్ రెండు రకాల బ్యాటరీ ప్యాక్ లతో వస్తుంది. స్టాండర్డ్ 58 కిలోవాట్-అవర్(కెడబ్ల్యుహెచ్) బ్యాటరీ ప్యాక్ గల కారును ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే  370 కిలోమీటర్లు, లాంగ్  రేంజ్ 77.4-కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ ప్యాక్ గల కారును ఒకసారి ఫుల్ రిచార్జ్ చేస్తే 475 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఏప్రిల్ లో కియాకు చెందిన అనుబంధ సంస్థ హ్యుందాయ్ మోటార్ కంపెనీ ఈ-జీఎంపీ ప్లాట్ ఫామ్ గల ఐఓఐక్యూ 5 ఆల్ ఎలక్ట్రిక్ మోడల్ ప్రారంభించింది. వచ్చే ఏడాది ఐఓఐక్యూ 6, 2024లో అయోనిక్ 7 బిగ్ ఎస్ యూవీని ప్రవేశపెట్టాలని హ్యుందాయ్ యోచిస్తోంది. ఇది బిఎమ్ డబ్ల్యు వంటి ప్రత్యర్థుల ఆల్ఫాన్యూమరిక్ పేర్లను ఉపయోగించడం ప్రారంభిస్తుంది. ఇది 3.5 సేకన్లలోనే 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. దీనిని 5 నిమిషాలు చార్జ్ చేస్తే 100 కి. మీ దూరం వరకు వెళ్లవచ్చు.

మరిన్ని వార్తలు