కియా నుంచి ఎస్‌యూవీ సోనెట్‌

8 Aug, 2020 08:52 IST|Sakshi

మేడిన్‌ ఏపీ కారు వర్చువల్‌గా లాంచ్‌ చేసిన కియా

 30కిపైగా అత్యాధునిక ఫీచర్స్‌

 పండుగల సీజన్‌లో     వాణిజ్య పరంగా మార్కెట్లోకి.. 

సాక్షి, అమరావతి: కియా మోటార్స్‌ మేడిన్‌ ఆంధ్రా సరికొత్త స్మార్ట్‌ అర్బన్‌ కాంపాక్ట్‌ ఎస్‌యూవీ ‘సోనెట్‌’ను శుక్రవారం వర్చువల్‌గా ఆవిష్కరించింది. రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో సెల్టోస్‌ తర్వాత తయారైన రెండవ కారు ఇది. వచ్చే పండుగల సీజన్‌కు ఈ కారును వాణిజ్యపరంగా మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. ఈ కారును వర్చువల్‌గా ఆవిష్కరిస్తూ కియా మోటార్‌ కార్పొరేషన్‌ సీఈవో హూ సంగ్‌ సాంగ్‌ మాట్లాడుతూ ప్రపంచ శ్రేణి నాణ్యతతో రూపొందించిన ఈ కారుడ్రైవర్‌తో పాటు ప్రయాణికులకు విన్నూతనమైన ఆనందాన్ని అందిస్తుందన్నారు.

భారతదేశంలో వృద్ధి చెందుతున్న ఎస్‌యూవీ మార్కెట్‌ అవసరాలను సోనెట్‌ తీర్చడమే కాకుండా విస్తృత శ్రేణి వినియోగదారులు కియా బ్రాండ్‌ పట్ల మరింతగా ఆకర్షితులవుతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కియా మోటర్స్‌ ఇండియా ఎండీ, సీఈవో కూఖ్యున్‌ షిమ్‌ మాట్లాడుతూ ప్రపంచం కోసం ఇక్కడ తయారైన కారుగా సోనెట్‌ను అభివర్ణించారు.సెల్టోస్, కార్నివాల్‌ తర్వాత మరో విభాగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకువస్తుందన్నారు. డ్రైవర్‌కు అలసట లేకుండా సుదీర్ఘ ప్రయాణం చేసే విధంగా క్లచ్‌ పెడల్‌ లేకుండా మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్స్, సిక్స్‌ స్పీడ్‌ స్మార్ట్‌ స్ట్రీమ్‌ ఇంటెలిజెంట్‌ మాన్యువల్‌ ట్రిన్స్‌మిషన్‌ వంటి 30కిపైగా ప్రత్యేకతలు ఈ సోనెట్‌ సొంతం. ఈ ఎస్‌యూవీ ధరను కియా ఇంకా ప్రకటించలేదు. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా