71 వేల కియా కార్ల రీకాల్‌.. ఎందుకో తెలుసా?

29 Oct, 2022 21:14 IST|Sakshi

ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ కియా తన సంస్థకు చెందిన 71వేల కార్లను రీకాల్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా కేంద్రంగా కియా కార్లలో వరుస అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో కార్లలో లోపాల్ని పరిశీలిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. 

సౌత్‌ కొరియా ఆటోమొబైల్‌ దిగ్గజం కియా 2008 -2009కి చెందిన 71వేల  స్పోర్టేజ్‌ కార్లను రీకాల్‌ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కారులో ఉన్న యాంటీ లాక్‌ బ్రేక్‌ సిస‍్టం (ఏబీఎస్‌)లోని హైడ్రాలిక్‌ కంట్రోల్‌ యూనిట్‌లోని లోపాల కారణంగా అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో కార్లలోని లోపాల్ని సరి చేసేందుకు సిద్ధమైనట్లు కియా వెల్లడించింది.    

2017 నుంచి 
కియా 2017 నుంచి తన  8 స్పోర్టేజ్‌ స్పోర్ట్‌ యుటిలిటి వెహికల్స్‌ (ఎస్‌యూవీ)లో అగ్నిప్రమాదాలు చోటు చేసుకోవడం, 15 రకాల మెల్టింగ్‌, డ్యామేజ్‌లాంటి ప్రమాదాలు గుర్తించింది. 2016 నుంచి ఆ వెహికల్స్‌లోని లోపాల్ని సరిచేయడం ప్రారంభించింది. 

దూరంగా పార్కింగ్‌
నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (ఎన్‌హెచ్‌టీఎస్‌ఏ) తో కియా దాఖలు చేసిన ప్రకారం  , రీకాల్ పూర్తయ్యే వరకు యజమానులు నిర్మాణాలు లేదా ఇతర వాహనాలకు వెలుపల,  దూరంగా పార్క్ చేయాలని కియా,ఎన్‌హెచ్‌టీఎస్‌ఏ  సమావేశంలో ఈ సమస్యల పరిష్కార మార్గంగా చర్చించాయి.

మరిన్ని వార్తలు