మార్కెట్లోకి మరో ఎస్‌యువి లాంచ్ చేసిన కియా ఇండియా

1 Sep, 2021 17:30 IST|Sakshi

ఆటోమొబైల్ మార్కెట్లో రోజుకొక కొత్త కారు విడుదల అవుతుంది. తాజాగా కియా ఇండియా దేశంలో మధ్య తరహా కియా సెల్టోస్ ఎస్‌యువి కారును విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.17.79 లక్షలుగా ఉంది. ఈ మోడల్ మ్యాట్ గ్రాఫైట్ కలర్, 18 అంగుళాల క్రిస్టల్ కట్ అలాయ్ వీల్స్, లెదర్ ఎట్ అప్ హోల్ స్ట్రీతో ఇతర ఫీచర్లతో వస్తుంది. సెల్టోస్ ఎక్స్ లైన్ ప్రత్యేకంగా జీ1.4 టీ-జీడీఐ 7 డీసీటీ, డీ1.5 6 ఎటీ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్లతో అందుబాటులో ఉంటుందని కియా ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. 

పెట్రోల్ ఎక్స్ లైన్ 7 డీసీటీ ట్రిమ్ ధర రూ.17.79 లక్షలు కాగా, డీజిల్ ఎక్స్ లైన్ 6 ఏటీ వేరియంట్ ధర రూ.18.10 లక్షలుగా ఉంది. కియా సెల్టోస్ ఎక్స్ లైన్ 1.4-లీటర్ స్మార్ట్ స్ట్రీమ్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ సీఆర్ డీఐ విజీటీ డీజిల్ మోటార్ వేరియంట్ అందుబాటులో ఉన్నాయి. రెండు సంవత్సరాల కంటే తక్కువ కాలంలో 2,00,000 యూనిట్ల అమ్మకాలు, 40 శాతానికి పైగా సెగ్మెంట్ వాటాను ఇది కలిగి ఉంది. సెల్టోస్ ప్రారంభించినప్పటి నుండి దాని విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతున్న వాహనాలలో ఒకటిగా ఉంది.(చదవండి: Amazon: రైతులకు టెక్నికల్‌గా సాయం)

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు