అమ్మకాల్లో బీభత్సం సృష్టిస్తున్న కారు.. కేవలం రెండేళ్లలోనే..

21 Jun, 2022 18:33 IST|Sakshi

కొరియన్‌ కార్ల తయారీ కంపెనీ ఇండియా మార్కెట్‌లో పాతుకు పోతుంది. ఒకదాని తర్వాత ఒకటిగా ఆ కంపెనీ నుంచి వస్తున్న కార్లు ఇక్కడి కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే సెల్టోస్‌ ఇక్కడ సక్సెస్‌ఫుల్ మోడల్‌గా పేరు తెచ్చుకుంది. సెల్టోస్‌ బాటలోనే పయణిస్తోంది సోనెట్‌ మోడల్‌.

కరోనా కష్టకాలం తర్వాత ఇండియాలో కార్ల అమ్మకాలు మందగించాయి. ఏళ్ల తరబడి మార్కెట్‌లో ఉన్న కంపెనీల నుంచి రిలీజ్‌ అవుతున్న కార్లు కూడా కిందా మీదా అవుతున్నాయి. కానీ కియా నుంచి వచ్చిన సోనెట్‌ మోడల్‌ అమ్మకాల్లో ఒక్కో రికార్డు బ్రేక్‌ చేస్తూ శరవేగంగా దూసుకెళ్తోంది.

కియా సంస్థ 2020 సెప్టెంబరులో సొనెట్‌ మోడల్‌ను ఇండియాలో రిలీజ్‌ చేసింది. రెండేళ్లు కూడా పూర్తి కాకముందే క్లిష్ట పరిస్థితుల నడుమ ఇండియాలో లక్షన్నర యూనిట్ల అమ్మకం రికార్డును సోనెట్‌ క్రాస్‌ చేసింది. కియో మొత్తం అమ్మకాల్లో కేవలం సోనెట్‌ వాటాయే 26 శాతానికి చేరుకుంది. అంతేకాదు కాంపాక్ట్‌ ఎస్‌యూవీ కేటగిరిలో సోనెట్‌ వాటా 15 శాతంగా ఉంది. 

కాంపాక్ట్‌ ఎస్‌యూవీ కేటగిరిలో సోనెట్‌ పవర్‌ ప్యాక్డ్‌ మోడల్‌గా నిలుస్తోంది. అధునాత ఇన్ఫోంటైన్‌మెంట్‌ సిస్టమ్‌, 16 ఇంచ్‌ ఎల్లాయ్‌ వీల్స్‌, మల్టీపుల్‌ ఎయిర్‌బ్యాగ్స్‌, టైర్‌ ప్రెషర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌, ఆండ్రాయిడ్‌/యాపిల్‌ కనెక్టివిటీ,  ఏబీఎస్‌ విత్‌ ఈబీడీ వంటి ఫీచర్లు ఉన్నాయి. హైఎండ్‌ మోడల్‌ వేరియంట్‌ ధర రూ.16.88 లక్షలుగా ఉంది.
 

చదవండి: గ్లోబల్‌ డ్రీమ్‌ క్రూయిజ్‌ షిప్‌.. టైటానిక్‌ కంటే దారుణంగా..

మరిన్ని వార్తలు