మీ చిన్నారుల కోసం.. భలే గాడ్జెట్‌ వచ్చేసింది!

15 Jan, 2023 09:40 IST|Sakshi

బుడిబుడి అడుగులైనా రాని చిన్నారి బుజ్జాయిలను షికారు తిప్పడానికి స్ట్రోలర్లు వాడటం మామూలే! ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో చాలామంది స్ట్రోలర్లు వాడుతుంటారు. రోడ్లు బాగున్నప్పుడు మాత్రమే వీటిలో షికారు బాగుంటుంది. గతుకులమౖయెన దారుల్లో స్ట్రోలర్ల షికారు చిన్నారులకు అంత సుఖంగా ఉండదు. గతుకుల కుదుపుల వల్ల వాళ్లకు వెన్ను, వీపు నొప్పి తలెత్తవచ్చు. 

గతుకుల దారుల్లోనైనా కుదుపులు లేకుండా ప్రయాణించేలా అధునాతన పరిజ్ఞానంతో సరికొత్త తరహా స్ట్రోలర్‌ను అమెరికన్‌ కంపెనీ ‘గ్లక్స్‌కైండ్‌’ రూపొందించింది. ‘ఎల్లా’ పేరిట రూపొందించిన ఈ స్ట్రోలర్‌ అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్ట్‌ సిస్టమ్‌తో పనిచేస్తుంది. అందువల్ల నిత్యం దీనిని వెనుక నుంచి నెట్టాల్సిన పని ఉండదు. ఎగుడు దిగుడు దారుల్లో వెళ్లాల్సి వచ్చినా, లోపల ఉన్న చిన్నారులకు కుదుపుల ఇబ్బంది కలగనివ్వదు. దీనిని ఇంకా మార్కెట్‌లోకి విడుదల చేయలేదు. ఈ ఏడాది జరగనున్న ‘కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ షో’లో ప్రదర్శించనున్నారు.

మరిన్ని వార్తలు