కిమ్‌ కర్దాషియన్‌ క్రిప్టో వివాద సెటిల్మెంట్‌

4 Oct, 2022 06:13 IST|Sakshi

ఎస్‌ఈసీకి 1.26 మిలియన్‌ డాలర్లు చెల్లింపు

న్యూయార్క్‌: క్రిప్టో కరెన్సీలను ప్రమోట్‌ చేసిన వివాదానికి సంబంధించి అమెరికన్‌ రియాలిటీ టీవీ స్టార్‌ కిమ్‌ కర్దాషియాన్‌ .. సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సే్చంజ్‌ కమిషన్‌ (ఎస్‌ఈసీ)తో సెటిల్మెంట్‌ చేసుకున్నారు. ఇందుకోసం 1.26 మిలియన్‌ డాలర్లు చెల్లించేందుకు ఆమె అంగీకరించారు. అలాగే మూడేళ్ల పాటు ఏ క్రిప్టో అసెట్‌నూ ప్రచారం చేయబోనని కిమ్‌ తెలిపారు.

వివరాల్లోకి వెడితే, ఎథీరియంమ్యాక్స్‌ సంస్థకు సంబంధించిన ఈమ్యాక్స్‌ క్రిప్టోకరెన్సీని తన ఇన్‌స్ట్రాగామ్‌ ఖాతా ద్వారా కిమ్‌ ప్రమోట్‌ చేశారు. అయితే, ఇందు కోసం ఆమె 2,50,000 డాలర్లు తీసుకున్న విషయాన్ని ఆమె వెల్లడించకపోవడం చట్టవిరుద్ధమని ఎస్‌ఈసీ అభియోగాలు మోపింది. ఈ నేపథ్యంలోనే వివాదానికి ముగింపు పలికేందుకు కిమ్‌ కర్దాషియన్‌ సెటిల్మెంట్‌కు ముందుకొచ్చినట్లు ఆమె తరఫు లాయర్‌ వెల్లడించారు.

మరిన్ని వార్తలు