షేర్లు అమ్మేసిన ఎలోన్ మస్క్ సోదరుడు

11 Feb, 2021 18:02 IST|Sakshi

ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ సీఈఓ ఎలోన్ మస్క్ సోదరుడు, టెస్లా ఇంక్. బోర్డు సభ్యుడు కింబాల్ మస్క్ తన వాటా షేర్లను అమ్మేశాడు. యుఎస్ సెక్యూరిటీస్ & ఎక్స్ఛేంజ్ కమీషన్ తెలిపిన వివరాల ప్రకారం కింబాల్ మస్క్ 25.6మిలియన్ డాలర్లు విలువైన షేర్లను విక్రయించారు. 48 ఏళ్ల కింబాల్ మస్క్ ఈ ఫిబ్రవరి 9న 30,000 షేర్లను సగటున 852.12 డాలర్లకు విక్రయించినట్లు యుఎస్ సెక్యూరిటీస్ & ఎక్స్ఛేంజ్ కమీషన్  తెలిపింది. అలాగే కింబాల్ మస్క్ ది కిచెన్ రెస్టారెంట్ సీఈఓ, గ్రూప్ సహ వ్యవస్థాపకుడు. 

టెస్లా షేర్లు బుధవారం 5.3 శాతం పడిపోయి 804.82 డాలర్లకు చేరుకుంది. టెస్లా షేర్లు 2020లో 743 శాతం పెరగగా 2021లో మరో 14 శాతం పెరిగింది. టెస్లా ఒక షేర్ ధర జనవరి 8న 880 డాలర్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక తెలిపిన వివరాల ప్రకారం టెస్లా ఇన్‌సైడర్‌లు కంపెనీలో 19.6 శాతం వాటాను కలిగి ఉన్నారు. అలాగే మరో టెస్లా బోర్డు సభ్యుడు ఆంటోనియో గ్రాసియాస్ కూడా 150,747 టెస్లా షేర్లను విక్రయించాడు. అతను కంపెనీలో 2,545 స్టాక్ హోల్డింగ్ కలిగి ఉన్నాడు. అతను భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని అమ్మేసుకున్నట్లు తెలుస్తుంది. దీనిని లాంగ్-టర్మ్ ఈక్విటీ యాంటిసిపేషన్ సెక్యూరిటీస్(LEAP) అని పిలుస్తారు.

మరిన్ని వార్తలు