కిమ్స్‌ ఖాతాలో మరో ఆసుపత్రి

30 Aug, 2022 05:58 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కృష్ణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (కిమ్స్‌) తాజాగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఉన్న కింగ్స్‌వే హాస్పిటల్స్‌లో 51 శాతం వాటాను కైవసం చేసుకుంది. ఈ కొనుగోలు ప్రక్రియలో భాగంగా కింగ్స్‌వే ఆసుపత్రికి రూ.80 కోట్లను కిమ్స్‌ పెట్టుబడి రూపంలో అందించనుంది.

ఈ మొత్తాన్ని రుణ భారం తగ్గించుకోవడానికి, బ్యాలెన్స్‌ షీట్‌ బలోపేతానికి వినియోగిస్తారు. కింగ్స్‌వే హాస్పిటల్స్‌కు 300లకుపైగా పడకల సామర్థ్యం ఉంది. మహారాష్ట్రలో నాసిక్‌ తర్వాత సంస్థకు ఇది రెండవ కేంద్రం అని కిమ్స్‌ ఎండీ భాస్కర రావు తెలిపారు.

మరిన్ని వార్తలు