మార్కెట్‌లోకి కైనెటిక్‌-ఐమా ఈవీ టూ-వీలర్స్‌

27 Jan, 2022 07:21 IST|Sakshi

ముంబై: ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీలో ఉన్న పుణే కంపెనీ కైనెటిక్‌ గ్రీన్‌ ఎనర్జీ, పవర్‌ సొల్యూషన్స్‌ తాజాగా చైనా దిగ్గజం ఐమా టెక్నాలజీ గ్రూప్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఇరు సంస్థలు కలిసి భారత మార్కెట్‌ కోసం ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాల రూపకల్పన, అభివృద్ధి చేస్తాయి. ఈ ప్రాజెక్ట్‌కు రూ.80-100 కోట్లు పెట్టుబడి చేయనున్నట్టు కైనెటిక్‌ గ్రీన్‌ ఎనర్జీ, పవర్‌ సొల్యూషన్స్‌ ఫౌండర్, సీఈవో సులజ్జా ఫిరోదియా మోత్వానీ తెలిపారు. 

‘కైనెటిక్‌-ఐమా భాగస్వామ్యంలో ఏడాదిలో మూడు మోడళ్లను పరిచయం చేయనున్నాం. ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సామర్థ్యం పెంపు, ఉత్పత్తుల అభివృద్ధి, విస్తరణకు వచ్చే అయిదేళ్లలో రూ.500 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించాం. దేశంలో ఈ–టూ వీలర్స్‌ 2–3 శాతమే విస్తరించాయి. వచ్చే 10 ఏళ్లలో ఇది 30 శాతానికి చేరుతుంది. కైనెటిక్‌ ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలకు మంచి డిమాండ్‌ ఉంది. నెలకు 5,000 యూనిట్ల దాకా విక్రయిస్తున్నాం’ అని తెలిపారు. 

(చదవండి: ఈపీఎఫ్‌ఓ చందాదారులకు శుభవార్త.. ఇక సులభంగానే!)

మరిన్ని వార్తలు