పదే పదే కింద పడినా.. ఎలా పైకి లేచాడో చూడండి!

28 Oct, 2022 19:55 IST|Sakshi

జీవిత సత్యాన్ని కళ్లకుకట్టే వీడియో షేర్‌ చేసిన షా

మనిషి జీవితం.. ఎగుడు దిగుడుల కలబోత. లైఫ్‌లో అప్‌ అండ్‌ డౌన్స్‌ చాలా సహజం. తన జీవన ప్రస్థానంలో ఎన్నో ఒడిదుకుడుకులను మనుషులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. లక్ష్యసాధనలో అవాంతరాలు, ఆటుపోట్లు ఉంటూనే ఉంటాయి. వాటన్నింటిని ఓర్పుతో అధిగమించిన వారికే విజయాలు సొంతమవుతాయని చరిత్ర చెబుతున్న సత్యం. 

పదేపదే ఓటమి ఎదురైనా లెక్కచేయకుండా ముందుకు సాగేవారు విజయులుగా కీర్తిశిఖరాలు అధిరోహిస్తారు. ఇలాంటి ఓ స్ఫూర్తిదాయక వీడియోను బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా తన ట్విటర్‌లో పేజీలో షేర్‌ చేశారు. గెలుపుదారిలో పడుతు లేస్తూ.. ఓ కళాకారుడు జీవిత సత్యాన్ని కళ్లకుకట్టిన తీరు వీక్షకలను ఆకట్టకుంటోంది. ఎన్నిసార్లు కిందకు పడినా గెలుపు శిఖరాన్ని అందుకునే వరకు విశ్రమించరాదన్న ఇతివృత్తంతో దీన్ని ప్రదర్శించారు. 


‘గెలుపు కోసం ప్రయాణం అంత తేలికైన విషయం కాదు. కిందకు పడిపోయిన ప్రతిసారి మరింత పట్టుదలతో ప్రయత్నించాలన్న సందేశంతో దీన్ని ప్రదర్శించిన ఈ కళాకారుడికి హాట్సాఫ్‌’ అని కిరణ్ మజుందార్ షా పేర్కొన్నారు. 
 

కాగా, కిరణ్ మజుందార్ షా భర్త జాన్ షా (73) బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో దీపావళి రోజున తుదిశ్వాస విడిచారు. కాన్సర్‌తో బాధపడుతూ ఆమె తల్లి యామిని మజుందార్‌ షా కూడా ఈ ఏడాది జూన్‌లో కన్నుమూశారు. తల్లిని కోల్పోయిన బాధ నుంచి కోలుకుంటున్న సమయంలో మరో విషాదం ఎదురవడంతో ఆమె తల్లడిల్లుతున్నారు. జీవితంలో ఆటుపోట్లను సమానంతో ఎదుర్కొవాలని తనకు తానే ధైర్యం చెప్పుకుంటున్నారు కిరణ్ మజుందార్ షా. (క్లిక్ చేయండి: శాంసంగ్‌కు వారసుడొచ్చాడు.. కొత్త సవాళ్లు)

మరిన్ని వార్తలు