ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌కి మారిపోతున్న ఖాకీలు

18 Sep, 2021 21:22 IST|Sakshi

కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ వాడాలంటూ కేంద్రం చెబుతున్న సూచనలకు అనుగుణంగా క్రమంగా ఒక్కో ప్రభుత్వ విభాగం ఎలక్ట్రిక్‌ వెహిలక్స్‌కి మారిపోతున్నాయి. తాజాగా అదే బాటలో వెళ్లాలని కోలకతా పోలీసులు నిర్ణయించుకున్నారు. 

కోల్‌కతా 
కోల్‌కతా నగర పోలీసులు ప్రస్తుతం ఉపయోగిస్తున్న డీజిల్‌ ఇంజన్‌ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్‌ వాహనాలు ఉపయోగించాలని నిర్ణయించారు. ఈ మేరకు 220 టాటా నెక్సాన్‌ కార్లను ఎనిమిదేళ్ల పాటు లీజుకు తీసుకునే ప్రతిపాదనను సిద్ధం చేశారు. ఇలా లీజుకు తీసుకున్న కార్లను పెట్రోలింగ్‌తో పాటు పోలిసింగ్‌ విధుల్లో ఉపయోగించాలని నిర్ణయించారు. ఈ మేరకు బెంగాల్‌ ప్రభుత్వం రూ. 8.82 కోట్లను కేటాయించింది. 

డీజిల్‌ స్థానంలో
కోల్‌కతా పోలీసు డిపార్ట్‌మెంట్‌ పరిధిలో అన్ని రకాలవి కలిసి మొత్తం నాలుగు వేల వరకు వాహనాలు ఉపయోగిస్తున్నారు. ఇందులో 200లకు పైగా వాహనాల జీవితకాలం ముగిసింది. వాటిని డీజిల్‌ వాహనాలకు బదులు ఈవీలతో భర్తీ చేస్తున్నారు. అంతకు కేరళా పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ సైతం పాత వాహనాల స్థానంలో నెక్సాన్‌ ఈవీలనే ప్రవేశపెట్టింది.

ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే
నెక్సాన్‌ ఈవీల ధర ప్రస్తుతం 14 లక్షల నుంచి 17 లక్షల వరకు ఉంది. ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 312 కిలోమీటర్లు మైలేజ్‌ వస్తుందని టాటా కంపెనీ చెబుతోంది. అయితే ఆ మేరకు మైలేజీ ఇవ్వడం లేదని ఫిర్యాదులు రావడంతో నెక్సాన్‌కు అందిస్తున్న సబ్సిడీని ఢిల్లీ ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో ఉపసంహరించుకుంది.
చదవండి: electric highway: త్వరలో దేశంలో ఈ నగరాల మధ్య తొలి ఎలక్ట్రిక్ హైవే!

మరిన్ని వార్తలు