రూ.45 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ ఎక్కువే!

30 Sep, 2021 21:00 IST|Sakshi

దేశంలో అత్యంత తక్కువకు లభిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ తమదే అని కోమాకి ఎలక్ట్రిక్ వెహికల్స్ నేడు ప్రకటించింది. గత ఏడాది జూన్ నెలలో విడుదల చేసిన కోమాకి ఎక్స్ జీటీ-ఎక్స్1 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రెండు మోడల్స్ లో లాంచ్ చేసినట్లు తెలిపింది. జెల్ బ్యాటరీ మోడల్ ధర ₹45,000 కంటే తక్కువ, లిథియం అయాన్ బ్యాటరీ మోడల్ ₹60,000 ధరకు లభిస్తున్నట్లు పేర్కొంది. ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోలిస్తే కోమాకి ఎక్స్ జీటీ-ఎక్స్1 చాలా తక్కువ ధరకే లభిస్తున్నట్లు కోమాకి ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రకటించింది.ఇప్పటి వరకు కోమాకి ఎక్స్ జిటి-ఎక్స్1 స్కూటర్లను 25,000 వరకు విక్రయించినట్లు కంపెనీ తెలిపింది. (చదవండి: దూకుడు పెంచిన ఓలా ఎలక్ట్రిక్!)

ఈ-స్కూటర్ ఎకో మోడ్‌లో120 కిలోమీటర్ల వరకు ప్రయాణించనున్నట్లు తెలిపింది. ఇందులో సింక్రనైజ్డ్ బ్రేకింగ్ సిస్టమ్, సైజ్ అప్ బిఐఎస్ వీల్స్ ఉన్నట్లు పేర్కొంది. కొమాకి ఎక్స్ జీటీ-ఎక్స్1లో టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, యాంటీ థెఫ్ట్ లాక్ సిస్టమ్, భారీ బూట్, స్మార్ట్ డ్యాష్, రిమోట్ సెన్సార్లు, రిమోట్ లాక్ ఫీచర్స్ ఉన్నాయి. కోమాకి తన లిథియం అయాన్ బ్యాటరీ స్కూటర్లకు 2+1(1 సంవత్సరం సర్వీస్ వారెంటీ) సంవత్సరాలు, లీడ్ యాసిడ్ బ్యాటరీ స్కూటర్లకు 1 సంవత్సరం వారెంటీ అందిస్తోంది.

కోమాకి ఎలక్ట్రిక్ డివిజన్ డైరెక్టర్ గుంజన్ మల్హోత్రా మాట్లాడుతూ.. "పెట్రోల్ ధరలు, కాలుష్యం ఎలా పెరుగుతున్నాయో చూస్తే మనం ఎలక్ట్రిక్ వాహనాలకు మారే సమయం ఆసన్నమైందని నేను నమ్ముతున్నాను. ప్రజలు మార్పును స్వీకరించడం ప్రారంభించారు. ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు మెరుగుపడుతుండటంతో రోడ్లపై మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలను చూస్తాము" అని అన్నారు.
 

మరిన్ని వార్తలు