నెటిజన్లకు షాక్‌, పోస్ట్‌లపై 'కూ' యాప్‌ కొరడా

3 Aug, 2021 09:22 IST|Sakshi

ట్విట్టర్‌కు ప‍్రత్యామ్నాయంగా వచ్చిన దేశీయ యాప్‌ 'కూ' యూజర్లపై కొరడా ఝుళిపించింది.కేంద్ర ప్రభుత్వం విధించిన సోషల్‌ మీడియా నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్న అకౌంట్లను బ్లాక్‌ చేసే పనిలో పడింది.
 
దేశ భద్రత దృష్ట్యా కేంద్రం సోషల్‌ మీడియాపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. కేంద్రం ప్రవేశ పెట్టిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్- 2021కు వ్యతిరేకంగా ఉన్న సోషల్‌ మీడియా అకౌంట్లపై ఆయా సోషల్‌ మీడియా సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా 'కూ' యాప్‌ 3,431 సోషల్‌ మీడియా పోస్టులపై దృష్టిసారించింది. జులై నెలలో కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ విరుద్దంగా ఉన్న 498 పోస్ట్‌లను డిలీట్‌ చేసింది. మరో 2,933 పోస్ట్‌లను పర్యవేక్షించనుంది.
 
కూ యాప్‌ వివరాల ప్రకారం.. 'ప్రో యాక్టీవ్‌ మోడరేట్‌'లో భాగంగా మొత్తం 65,280 పోస్ట్‌ లను దృష్టిసారించగా..వాటిలో 1,887 పోస్ట్‌లను డిలీట్‌ చేసినట్లు మిగిలిన 63,393 పోస్ట్‌లపై హెచ్చరికలు జారీ చేయడం, బ్లర్‌ చేయడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. 

అకౌంట్‌ వెరిఫికేషన్‌ 
జులైలో ఐటీ రూల్స్‌ అనుగుణంగా ఉన్న ట్విట్టర్‌ యూజర్లు తమ అకౌంట్లను బ్లూటిక్‌ వెరిఫికేషన్‌కు అప్లయ్‌ చేయాలని సూచించింది. తాజాగా కూ యాప్‌ సైతం ఎల్లో టిక్‌ వెరిఫికేషన్‌కు అప్లయ్‌ చేయాలని కోరింది. కాగా, బ‍్లూటిక్‌, ఎల్లో టిక్‌ వెరిఫికేషన్‌ అకౌంట్‌ కావాలంటే ప్రముఖులై ఉండాలి. ఉదాహరణకు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, సినిమా స్టార్స్‌, స్పోర‍్ట్స్‌ పర్సన్‌, బిజినెస్‌ మ్యాగ‍్నెట‍్స్‌  ఇలా ఆయా రంగాల్లో రాణిస్తున్న వారి సేవలకు గుర్తుగా ఆయా సోషల్‌ మీడియా సంస‍్థలు ఈ వెరిఫికేషన్‌ అకౌంట్లను అందిస్తుంటాయి.    

మరిన్ని వార్తలు