-

Koo: పబ్లిసిటీ కోసం రోజు రూ. 2.6 లక్షల ఖర్చు..!

9 Oct, 2021 18:27 IST|Sakshi

ట్విటర్‌కు పోటీగా  స్వదేశీ పరిజ్ఞానంతో భారతీయులకు ‘కూ’ మైక్రో బ్లాగింగ్‌ సోషల్‌ మీడియా యాప్‌ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. కూ యాప్‌ను భారతీయులు భారీగానే ఆదరిస్తున్నారు. కూ యాప్‌ను ప్రారంభించిన 16 నెలల కాలంలో 10 మిలియన్ల యూజర్లను సొంతం చేసుకుంది. విదేశీ సోషల్‌ మీడియా యాప్స్‌తో  పోటీపడుతూ ‘కూ’ యాప్‌ దూసుకెళ్తోంది. 

ఫేస్‌బుక్‌, ట్విటర్లకు పోటీగా...!
స్వదేవీ సోషల్ మీడియా యాప్ కూ ఒక బిగ్ బ్యాంగ్‌తో ప్రారంభమైంది. యూజర్లు, కొన్ని ప్రభుత్వ అధికారుల నుంచి కూ యాప్‌ భారీగా ఆసక్తిని సంపాందించింది.  ట్విటర్‌కు, కేంద్రానికి మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతినడంతో కూ యాప్‌ గణనీయంగా పుంజుకుంది. ప్రముఖ సోషల్‌మీడియా  ట్విటర్‌ను ఎదుర్కొనేందుకు కూ యాప్‌ యాడ్స్‌ విషయంలో భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.  
చదవండి:  అదిరిందయ్యా ముఖేశ్‌ అంబానీ.. ! జెప్‌బెజోస్‌, ఎలన్‌ మస్క్‌తో పాటు..

ఫేస్‌బుక్ యాడ్ లైబ్రరీ ప్రకారం....గత 90 రోజుల్లో ఫేస్‌బుక్ యాడ్స్ కోసం  కూ కంపెనీ సుమారు రూ. 2.4 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అంటే రోజుకు రూ. 2.6 లక్షల మేర కూ యాప్‌ ఖర్చు చేసింది. గత మూడు నెలల్లో ఫేస్‌బుక్‌లో అత్యధికంగా ఖర్చు చేసిన కంపెనీగా కూ యాప్‌ నిలిచింది.  కూ  యాప్‌  వ్యూహంలో భాగంగా  - హిందీ, ఇంగ్లీష్, అస్సామీ, గుజరాతీ, కన్నడ, తమిళం , తెలుగు వంటి భాషలతో యాప్‌ను రూపొందించింది. 

ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయం
అమెరికాకు చెందిన ట్విట్టర్‌ను వినియోగించే జాబితాలో భారత్‌  22.1 మిలియన్ల యూజర్లతో మూడో స్థానంలో ఉంది. అదే సమయంలో నవంబర్‌ 14,2019 లో ట్విట్టర్‌ కు ప్రత్యామ్నాయంగా ఎంట్రప్రెన్యూర్ లు  అప్రమేయ రాధాకృష్ణ, మయాంక్ లు బెంగళూరు కేంద్రంగా 'కూ' ను అందుబాటులోకి తెచ్చారు.
చదవండి: కంపెనీల మధ్య పోటాపోటీ..! నిన్న అమితాబ్‌ బచ్చన్‌..నేడు రణ్‌వీర్‌సింగ్‌..!

మరిన్ని వార్తలు