టీవీఎస్‌ లాజిస్టిక్స్‌లో కోటక్‌ పెట్టుబడి

14 Sep, 2021 06:32 IST|Sakshi

ముంబై: ఆటో రంగ దిగ్గజం టీవీఎస్‌ కుటుంబ కంపెనీలో కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ రూ. 1,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనుంది. టీవీఎస్‌ కుటుంబం ప్రమోట్‌ చేసిన థర్డ్‌పార్టీ లాజిస్టిక్స్‌(3పీఎల్‌)లో అనుబంధ సంస్థ కోటక్‌ స్పెషల్‌ సిట్యుయేషన్స్‌ ఫండ్‌ ద్వారా పెట్టుబడులకు దిగుతోంది. టీవీఎస్‌ సప్లై చైన్‌ సొల్యూషన్స్‌లో రూ. 200 కోట్లు ఇన్వెస్ట్‌ చేసింది. అంతేకాకుండా టీఎస్‌ రాజమ్‌ రబ్బర్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌కు రూ. 800 కోట్ల రుణ సౌకర్యాలను కలి్పంచింది.

ఇందుకు మార్పిడిరహిత డిబెంచర్ల మార్గాన్ని కోటక్‌ స్పెషల్‌ ఎంచుకుంది. ఈ రుణం సహాయంతో టీవీఎస్‌ సప్లై చైన్‌లో కెనడియన్‌ పెన్షన్‌ ఫండ్‌కుగల వాటాను టీవీఎస్‌ ఎస్‌సీఎస్‌ ప్రమోటర్‌ ఆర్‌.దినేష్‌ సొంతం చేసుకోనున్నారు. తద్వారా టీవీఎస్‌ సప్లై చైన్‌లో టీవీఎస్‌ కుటుంబ వాటా బలపడనుంది. కోటక్‌ స్పెషల్‌ సిట్యుయేషన్స్‌..  ఆల్టర్నేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ విభాగంలో రిజస్టరైంది. బిలియన్‌ డాలర్ల(సుమారు రూ. 7,400 కోట్లు) పెట్టుబడులను నిర్వహిస్తోంది.

మరిన్ని వార్తలు