దశాబ్దం కనిష్టానికి కోటక్‌ మహీంద్రా గృహ వడ్డీ

10 Sep, 2021 01:31 IST|Sakshi

నవంబర్‌ 8 వరకు 6.50% నుంచి ఆఫర్‌

ముంబై: పండుగల సీజన్‌లో గృహ రుణ మార్కెట్‌లో వాటా పెంచుకోవడమే ప్రధాన ధ్యేయంగా ప్రైవేటు రంగంలోని కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఈ విభాగంలోని వడ్డీరేట్లను తగ్గించింది. ఈ మేరకు బ్యాంక్‌ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. గృహ రుణ వడ్డీరేటును 15 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒకశాతం) తగ్గింది. దీనితో ఈ రుణ రేటు 6.50 శాతం నుంచి కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. ‘ఈ గృహ రుణ రేటు దశాబ్దపు కనిష్ట స్థాయి’ అని కన్జూ్యమర్‌ అసెట్స్‌ ప్రెసిడెంట్‌ అంబుచ్‌ చందన తెలిపారు. అయితే ఆ ఆఫర్‌ రెండు నెలలు అంటే నవంబర్‌ 8వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. అత్యధిక క్రెడిట్‌ స్కోర్‌ కలిగిన ఉద్యోగులకు మాత్రమే దిగువ స్థాయి రుణ రేటు ఆఫర్‌ను అందిస్తున్నట్లు వివరించారు. బ్యాంక్‌ గృహ రుణ విభాగం మంచి పనితీరును కనబరుస్తోందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.

మరిన్ని వార్తలు