కోటక్‌ మహీంద్ర బ్యాంకు వినియోగదారులకు గుడ్‌ న్యూస్‌

11 Apr, 2023 16:17 IST|Sakshi

సాక్షి, ముంబై: ప్రైవేటు రంగ బ్యాంకింగ్‌దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంకు   తన కస్టమర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పింది.  రూ. 2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది.  ఎంపిక చేసిన కాల వ్యవధిలోని ఫిక్స్‌డ్ డిపాజిట్ల (ఎఫ్‌డి) వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచింది.  ఈ సవరించిన వడ్డీ రేట్లు  సోమవారం( ఏప్రిల్ 10, 2023)నుంచి అమల్లోకి వచ్చాయి.

7 రోజుల నుంచి 10 సంవత్సరాల ఎఫ్‌డీలపై సాధారణ ఖాతాదారులకు 2.75 శాతం నుంచి 7.20 శాతం వరకు వడ్డీ రేటును కోటక్ మహీంద్రా బ్యాంకు చెల్లిస్తుంది. అలాగే  సీనియర్ సిటిజన్లకు 3.25 శాతం నుండి 7.70 శాతం వరకు వడ్డీ రేట్లను చెల్లిస్తుంది. సాధారణ ఖాతాదారులతో పోల్చితే, సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీ రేటును అందిస్తుంది. (చిన్న రుణాలనుంచి..వరల్డ్‌ టాప్‌ బ్యాంకర్స్‌లో స్థానం దాకా! కిక్‌ అంటే ఇది!)

అలాగే 390 రోజుల నుంచి రెండేళ్ల లోపు ఎఫ్‌డీలపై సాధారణ ఖాతాదారులకు గరిష్టంగా 7.20 శాతం, అలాగే సీనియర్ సిటిజన్లకు గరిష్టంగా 7.70 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. (మాజీ సీఈవో పరాగ్‌ అగర్వాల్‌ దెబ్బ! మస్క్‌కు భారీ ఝలక్‌!)

ఎఫ్‌డీలపై  కోటక్ మహీంద్రా బ్యాంకు ప్రస్తుత వడ్డీ రేట్లు
2 నుంచి  మూడేళ్ల లోపు కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై  7 శాతం  
3 నుంచి  నాలుగేళ్ల లోపు పరిమితి  గల  ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు 6.50 శాతం 
4- 5 సంవత్సరాల కంటే తక్కువ కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై 6.25 శాతం 
5 - 10 సంవత్సరాల వరకు కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు 6.20 శాతం వడ్డీ రేటును  బ్యాంకు చెల్లిస్తుంది.

మరిన్ని వార్తలు