Kotak Mahindra Bank: కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఖాతాదారులకు అదిరిపోయే శుభవార్త..!

10 Mar, 2022 08:19 IST|Sakshi

ప్రముఖ ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంక్ తాజాగా తన ఖాతాదారులకు  శుభవార్తను అందించింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ కోటక్‌ నిర్ణయం తీసుకుంది. ఈ వడ్డీరేట్ల పెంపు డొమెస్టిక్, ఎన్ఆర్ఓ, ఎన్ఆర్ఈ కస్టమర్లకు వర్తించనుంది. 

కొత్త వడ్డీ రేట్ల అమలు
2022 మార్చి 9 నుంచి సవరించిన కొత్త వడ్డీ రేట్లు అమలులోకి వస్తాయని కోటక్ మహీంద్రా బ్యాంక్ తెలిపింది. రూ.2 కోట్ల వరకు బ్యాలెన్స్ కలిగిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ అకౌంట్లకు ఈ వడ్డీ రేట్లు వర్తించనున్నాయి. దీంతో 365 నుంచి 389 రోజుల మెచ్యూరిటీ కలిగిన ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు 5 శాతానికి పెరిగింది. గతంలో ఈ ఎఫ్‌డీలపై 4.9 శాతం వడ్డీ రేటును కోటాక్‌ అందించింది.  సీనియర్ సిటిజన్స్‌కు 50 బేసిస్ పాయింట్ల మేర అదనపు వడ్డీ రేటు లభిస్తుంది. కాగా గత నెలలో ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్ వంటి ఇతర బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన విషయం తెలిసిందే.

సవరించిన వడ్డీరేట్లు ఇలా..!

► 7 రోజుల నుంచి 30 రోజుల కాలపరిమితి ఎఫ్‌డీలపై 2.5 శాతం

►  31 నుంచి 90 రోజుల ఎఫ్‌డీలపై 2.75 శాతం

►  91 నుంచి 120 రోజుల ఎఫ్‌డీలపై 3 శాతం వడ్డీ 

►  7 రోజుల నుంచి 10 ఏళ్ల కాలపరిమితి ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 2.5 శాతం నుంచి 5.8 శాతం వరకు ఉంటుంది. 

►  181 రోజుల నుంచి 363 రోజుల ఎఫ్‌డీలపై 4.4 శాతం

►  364 రోజుల ఎఫ్‌డీలపై 4.5 శాతం

►  390 రోజుల నుంచి 23 ఏళ్లలోపు ఎఫ్‌డీలపై 5.1 శాతం

►   3 నుంచి 5 ఏళ్లలోపు ఎఫ్‌డీలపై 5.45 శాతం

►  5 ఏళ్లుపై మించిన ఎఫ్‌డీలపై 5.5 శాతం

చదవండి: క్రెడిట్‌కార్డు వాడుతున్నారా..! అయితే మీకో షాకింగ్‌ వార్త..!


 

మరిన్ని వార్తలు