BGMI గేమ్ యూజర్ల డేటా భద్రతపై క్రాఫ్టన్‌ క్లారిటీ

24 Jun, 2021 21:09 IST|Sakshi

కేంద్రం గత ఏడాది దేశ భద్రత దృష్ట్యా చైనాకు చెందిన 256 యాప్స్‌పై కేంద్రం నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇందులో చైనా టెన్సెంట్ సంస్థకు చెందిన పబ్‌జీ కూడా ఉంది. వాస్తవానికి పబ్‌జీ చైనాది కాదు. సౌత్‌ కొరియాకు చెందిన యాప్‌. ఈ పేటెంట్‌ రైట్స్‌ ను చైనా టెన‍్సెంట్‌ సంస్థ దక్కించుకొని దాని కార్యకలాపాల్ని నిర్వ హిస్తుంది. వివిధ దేశాల్లో గేమ్‌ను రిలీజ్‌ చేసి భారీ ఎత్తున సొమ్ము చేసుకుంది. గత ఏడాది నిషేదం తర్వాత కొద్ది రోజుల క్రితమే సౌత్‌ కొరియాకు చెందిన క్రాఫ్టన్‌ సంస్థ పబ్‌జీ గేమ్‌ను కాస్తా బ్యాటిల్‌ గ్రౌండ్‌ మొబైల్‌ ఇండియాగా మార్పులు చేసి మార్కెట్‌ లోకి విడుదల చేసింది. 

బ్యాటిల్‌ గ్రౌండ్‌ మొబైల్‌ ఇండియా గేమ్ డేటాను ఈ చైనా సంస్థ ముంబై, సింగపూర్ సర్వర్లలో భద్రపరుస్తుంది. ఇప్పుడు విడుదలైన బీజీఎంఐ వినియోగదారుల డేటా ముంబైలో ఉన్న సర్వర్‌ ల నుంచి అక్రమంగా చైనాలో ఉన్న సంస్థ సర్వర్లలోకి వెళ్లినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే, వీటిపై క్రాఫ్టన్‌ స్పందించింది. ప్రస్తుత బీజీఎంఐ యూజర్ల డేటాను చైనా సర్వర్లలో నిల్వ చేస్తున్నట్లు క్రాఫ్టన్‌ ఒప్పుకుంది. అయితే, ఇతర మొబైల్‌ యాప్స్‌, గేమ్స్‌ మాదిరిగానే ఈ గేమ్‌కు యూనిక్‌ ఫీచర్ల కోసం థర్డ్‌ పార్టీ సేవలను వినియోగించుకుంటున్నామని అందుకోసమే గేమ్‌కు సంబంధించిన డేటాను వారికి షేర్‌ చేయాల్సి వచ్చింది. అయితే కొత్తగా తీసుకొచ్చిన క్రాఫ్టన్‌ ప్రైవసీ పాలసీ పూర్తిగా యూజర్ల భద్రతకు ప్రాధాన్యం ఇస్తుంది. ప్లేయర్ల డేటా నిర్వహణ, రక్షణకు కట్టుబడి ఉన్నట్లు సంస్థ ప్రకటించింది. కొత్తగా తీసుకొచ్చిన అప్‌డేట్‌ చైనీస్‌ సర్వర్లకు యూజర్ల డేటా బదిలీ కాకుండా నిరోధిస్తుందని క్రాఫ్టన్‌ పేర్కొంది.

చదవండి: సరికొత్త టెక్నాలజీ.. సౌండ్ ద్వారానే ఫోన్లు ఛార్జింగ్

మరిన్ని వార్తలు