Battlegrounds Mobile India భారీ స్థాయిలో ప్రి రిజిస్ట్రేషన్‌

3 Jun, 2021 15:22 IST|Sakshi

పబ్జీ గేమ్ మనదేశంలో మళ్లీ బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియాగా లాంచ్ కానున్న సంగతి తెలిసిందే. మే 18న ప్రారంభ‌మైన ఈ గేమ్ ను రికార్డ్ స్థాయిలో ప్రి- రిజిస్ట్రేష‌న్లు న‌మోదు చేసుకుంటున్న‌ట్లు ప‌బ్జీ గేమ్ సంస్థ క్రాప్ట‌న్ తెలిపింది. ద‌క్షిణ కొరియా చెందిన ప్రముఖ గేమింగ్ సంస్థ క్రాప్ట‌న్ కు చెందిన ప‌బ్జీ గేమ్ ను ఇప్ప‌టి వ‌ర‌కు 20 మిలియ‌న్ల మంది గేమింగ్ ప్రియులు  ప్రీ- రిజిస్ట్రేష‌న్లు చేసుకున్నార‌ని కంపెనీ ప్ర‌త‌నిధులు తెలిపారు. రిజిస్ట్రేష‌న్ల‌ను ప్రారంభించిన తొలిరోజే సుమారు 7.6 మిలియ‌న్ల మంది ప్రి-రిజిస్ట్రేష‌న్లు  చేసుకున్న‌ట్లు తెలుస్తోంది.  అయితే ఆ గేమ్ ఎప్పుడు విడుద‌ల‌వుతుందనే విష‌యాన్ని వెల్ల‌డించలేదు. 

కాగా, భార‌త్ - చైనా స‌రిహ‌ద్దు వివాదం నెల‌కొన్న నేప‌థ్యంలో  డ్రాగ‌న్ కంట్రీకి చెందిన యాప్స్ పై కేంద్రం  నిషేదం విధించిన విష‌యం తెలిసిందే. మే 2020న అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన ఎమ్మెల్యే  నినాంగ్ ఎరింగ్ భార‌త్ లో ప‌బ్జీ గేమ్ ను నిలిపి వేయాల‌ని  ప్రధాని మోడీకి లేఖ రాశారు. ప‌బ్జీ గేమ్ భార‌త సంస్కృతిని ప‌క్క‌దారి ప‌ట్టించేలా ఉంద‌ని , ప్రభుత్వాన్ని మరియు భారత‌ పౌరులను మోసగించడానికి ఈ గేమ్ ను విడుద‌ల చేశార‌ని అనుమానం వ్య‌క్తం చేస్తూ ఎమ్మెల్యే నినాంగ్ ఎరింగ్ త‌న లేఖ‌లో పేర్కొన్నారు. ఈ లేఖ‌తో కేంద్రం న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టింది. చైనా యాప్స్ ను బ్యాన్ చేస్తూ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.  


చ‌ద‌వండి : పబ్‌జీ గేమింగ్‌ ప్రియులకు మరో చేదువార్త

మరిన్ని వార్తలు