-

బజాజ్ చేతక్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. యూరప్‌ దేశాల్లో అమ్మకాలకు సర్వం సిద్ధం!

21 Jan, 2023 11:49 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: చేతక్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఏడాదిలో యూరప్‌లో అడుగుపెట్టబోతోంది. బజాజ్‌ ఆటో భాగస్వామి అయిన స్పోర్ట్స్‌ బైక్స్‌ త యారీ దిగ్గజం కేటీఎం ఈ స్కూటర్లను విక్రయించనుంది. 2019లో ఎలక్ట్రిక్‌ రూపంలో రీఎంట్రీ ఇచ్చిన చేతక్‌ ఇప్పటి వరకు దేశంలో 24,000 యూ నిట్లు రోడ్డెక్కాయి.ప్రస్తుతం 40 నగరాల్లో మాత్రమే ఈ వాహనాన్ని కంపెనీ విక్రయిస్తోంది. 

1972లో చేతక్‌ భారత్‌లో రంగ ప్రవేశం చేసింది. సామాన్యుడి వాహనంగా వినుతికెక్కింది. 2006 నుంచి చేతక్‌ స్కూటర్ల తయారీని బజాజ్‌ నిలిపివేసి బైక్స్‌పైనే పూర్తిగా దృష్టిసారింది. కాగా, కేటీఎం తాజాగా చకన్‌ ప్లాంటులో 10 లక్షల బైక్‌ల తయారీని పూర్తి చేసింది.

2011లో ఈ ప్లాంటు నుంచి కేటీఎం తొలి బైక్‌ బయటకు వచ్చింది. 5 లక్షల యూనిట్లు దేశీయంగా అమ్ముడయ్యాయి. మరో 5 లక్షల యూని ట్లు భారత్‌ నుంచి 70 దేశాలకు ఎగుమతి అయ్యా యి. ప్రీమియం మోటార్‌బైక్‌ బ్రాండ్‌గా ప్రపంచంలో తొలి స్థానంలో నిలిచినట్టు కేటీఎం ప్రకటించింది.    

మరిన్ని వార్తలు