దావోస్‌లో యంగ్‌ అచీవర్స్‌తో మంత్రి కేటీఆర్‌ మాటామంతి

23 May, 2022 15:52 IST|Sakshi

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ లండన్‌ నుంచి జ్యూరీచ్‌ మీదుగా దావోస్‌కి చేరుకున్నారు. అక్కడికి వెళ్లిన వెంటనే ఇండియన్‌ స్టార్టప్‌ కల్చర్‌కి బూస్ట్‌ తెచ్చిన యంగ్‌ అచీవర్స్‌ను పర్సనల్‌గా కలుసుకున్నారు. ఆన్‌లైన్‌ స్టాక్‌మార్కెట్‌ బ్రోకింగ్‌ ఏజెన్సీ జెరోదా ఫౌండర్‌ నితిన్‌ కామత్‌, మీషో ఫౌండర్‌ విదిత్‌ఆత్రేలను కలుసుకున్నారు. ఈ ముగ్గురు కలిసి భోజనం చేస్తూ పలు అంశాలపై మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోను మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

స్విస్‌రే
ముఖ ఇన్సురెన్సు సంస్థ స్విస్‌రే తెలంగాణలో మరిన్ని రంగాల్లో విస్తరించేందుకు సుముఖత వ్యక్తం చేసిందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. గతేడాది ఆగస్టులో స్విస్‌ రే సంస్థ సుమారు 250 మంది సిబ్బందితో హైదరాబాద్‌లో ఇన్సురెన్సు సేవలు ప్రారంభించింది.  హైదరాబాద్‌లో ఉన్న బీఎస్‌ఎఫ్‌ఐ ఎకోసిస్టమ్‌ ప్రోత్సహాకరంగా ఉండటంతో ఇక్కడే డిజిటల్‌, డేటా, ప్రొడక్ట్‌ మోడలింగ్‌, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ రంగాల్లో పెట్టుబడులకు ఆసక్తి చూపుతోంది.  160 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కంపెనీ 80 దేశాల్లో సర్వీసులు అందిస్తోంది.

చదవండి: ఏపీలో ప్రతీ కుటుంబానికి ‘ఫ్యామిలీ డాక్టర్‌’ - డబ్ల్యూఈఎఫ్‌ సదస్సులో వైఎస్‌ జగన్‌

మరిన్ని వార్తలు