సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్స్‌ జాబితాలో మంత్రి కేటీఆర్‌కు చోటు!

17 Jan, 2023 17:18 IST|Sakshi

ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అరుదైన ఘనత సాధించారు. ప్రపంచంలోనే టాప్‌ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్స్‌ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నారు. 

స్విర్జర్లాండ్‌లోని దావోస్‌ వేదికగా జనవరి 16 నుంచి జనవరి 20 వరకు వరల్డ్‌ ఎకనమిక్స్‌ ఫోరమ్‌ (డబ్ల్యూఈఎఫ్‌) వార్షిక సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల సందర్భంగా డబ్ల్యూఈఎఫ్‌ ప్రపంచంలోనే టాప్‌ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్స్‌ జాబితాను విడుదల చేసింది. ఆ జాబితాలో మంత్రి కేటీఆర్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా చోటు దక్కించుకున్నారు. ఈ లిస్ట్‌లో కేటీఆర్‌ 12వ స్థానాన్ని దక్కించుకోగా.. రాఘవ్‌ చద్దా 23వ స్థానంలో నిలిచారు. 

ఇక కేటీఆర్‌ హ్యాండిల్‌ చేసే ట్విటర్‌ అకౌంట్‌ @కేటీఆర్‌టీఆర్‌ఎస్‌కు 12వ ర్యాంక్‌, @మినిస్టర్‌కేటీఆర్‌ అకౌంట్‌కు 22 ర్యాంక్‌ ఇచ్చింది. 

మరిన్ని వార్తలు