తెలంగాణకు రాబోతున్న స్విస్‌ రైల్‌ కోచ్‌ తయారీ కంపెనీ! రూ. 1000 కోట్లతో..

25 May, 2022 15:06 IST|Sakshi

రైల్‌ కోచ్‌ తయారీ రంగంలో తెలంగాణ మరోసారి భారీ పెట్టుబడులను ఆకర్షించగలిగింది. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సులో ఈ మేరకు అంగీకారం కుదిరింది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో వెల్లడించారు.  స్విట్జర్లాండ్‌కి చెందిన రైలు కోచ్‌ల తయారీ సంస్థ స్టాడ్‌లర్‌ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ ఈవీపీ ఆన్స్‌గర్‌ బ్రూక్‌మేయర్‌తో మంత్రి కేటీఆర్‌ దావోస్‌లో చర్చలు జరిపారు.  ఈ చర్చలు ఫలప్రదంగా ముగియడంతో త్వరలో  తెలంగాణలో రైలు కోచ్‌ల తయారీ రంగంలో ఇన్వెస్ట్‌ చేయబోతున్నట్టు స్టాడ్‌లర్‌ బుధవారం  ప్రకటించింది. 

తెలంగాణలో నెలకొల్పబోయే రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ కోసం స్టాడ్‌లర్‌ సంస్థ రూ.1000 కోట్లు ఇన్వెస్ట్‌ చేయబోతుంది. ఈ పరిశ్రమ ద్వారా దాదాపు 2500ల మంది యువతికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. తెలంగాణలో ఇప్పటికే ప్రైవేటు రంగంలో మేధా సంస్థ రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీని నిర్మిస్తోంది. తాజాగా స్టాడ్‌లర్‌ సంస్థ రైల్‌ కోచ్‌ల తయారీ రంగంలో పెట్టుబడులకు రెడీ అయ్యింది. మేధా సంస్థతో కలిసి స్టాడ్‌లర్‌ తెలంగాణలో పని చేయనుంది. 

 షిండ్లర్‌ సైతం
తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు షిండ్లర్‌ సంసిద్ధత వ్యక్తం చేసింది. షిండ్లర్‌ ఈవీపీ లుక్‌రెమ్‌నాంట్‌తో దావోస్‌లో ఉన్న తెలంగాణ పెవిలియన్‌లో కేటీఆర్‌ సమావేశమయ్యారు. అనంతరం తెలంగాణలో రెండో స్టేట్‌ ఆఫ్‌ ఆర్ట్‌ మాన్యుఫ్యాక‍్చరింగ్‌ ఫెసిలిటీ సెంటర్‌ ఏర్పాటుకు షిండ్లర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ​ఇచ్చింది. డిజిటల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ ఆఫ్‌ ఎనర్జీ మేనేజ్‌మెంట్‌లో గ్లోబల్‌ లీడర్‌గా షిండ్లర్‌ ఉంది. వందకు పైగా దేశాల్లో షిండర్ల్‌ విస​‍్తరించి ఉంది.

చదవండి: KTR: ‘మరో 20 ఏళ్లలో దేశ ప్రధానిగా కేటీఆర్‌’!

మరిన్ని వార్తలు