KTR Davos Tour: తెలంగాణకి గుడ్‌న్యూస్ ! ఫెర్రింగ్‌ ఫార్మా మరో రూ.500 కోట్లు..

25 May, 2022 18:38 IST|Sakshi

దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌లో తెలంగాణకు భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. బుధవారం ఫెర్రీ ఫార్మా ప్రతినిధులతో మంత్రి కేటీఆర్‌ సమావేశమయ్యారు. ఈ చర్చల అనంతరం శుభవార్తను మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. హైదరాబాద్‌లో మరో యూనిట్‌ను నెలకొల్పేందుకు రూ.500 కోట్లు ఇన్వెస్ట్‌ చేసేందుకు ఫెర్రీ ఫార్మా అంగీకారం తెలిపిందని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు.

స్విట్జర్లాండ్‌కి చెందిన ఫ్రెర్రింగ్‌ ఫార్మా గతంలోనే తెలంగాణలో పెట్టుబడులకు అంగీకారం తెలిపింది. ఈ మేరకు ఇప్పటికే రూ. 500 కోట్లు కేటాయించింది. వీటితో హైదరాబాద్‌లో ఫార్ములేటింగ్‌ సెంటర్‌ను నెలకొల్పింది. దీన్ని మంత్రి కేటీఆర్‌ రెండు నెలల కిందట ప్రారంభించారు. ఇంతలో దావోస్‌లో డబ్ల్యూఈఎఫ్‌ సమావేశాలు జరగడం ఫెర్రీ ప్రతినిధులతో మరోసారి కేటీఆర్‌ సమావేశం కావడం జరిగింది. ఫలితంగా రెండో యూనిట్‌ స్థాపనకు రూ.500 కోట్ల కేటాయించేందుకు ఫ్రెర్రీ ఫార్మా ముందుకు వచ్చింది. 

చదవండి: తెలంగాణకు రాబోతున్న స్విస్‌ రైల్‌ కోచ్‌ తయారీ కంపెనీ! రూ. 1000 కోట్లతో..

మరిన్ని వార్తలు