ఈపీఎఫ్‌వో సభ్యులకు ఈ పాస్‌బుక్‌

29 Mar, 2023 01:18 IST|Sakshi

ప్రారంభించిన కార్మిక మంత్రి యాదవ్‌

న్యూఢిల్లీ: ఈపీఎఫ్‌వో చందాదారులకు ఈ–పాస్‌బుక్‌ సదుపాయాన్ని కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ ప్రారంభించారు. దీంతో సభ్యులు తమ ఖాతా వివరాలను మరింత గ్రాఫికల్‌గా చూసుకోవచ్చని ఈపీఎఫ్‌వో ప్రకటించింది.

ఈపీఎఫ్‌వోకు సంబంధించి 63 ప్రాంతీయ కార్యాలయాల్లో (100కు పైగా ఉద్యోగులు ఉన్న) క్రెచే సదుపాయాలను సైతం మంత్రి భూపేంద్ర యాదవ్‌ ప్రారంభించారు. ఉద్యోగులు తమ పిల్లలను ఇక్కడ విడిచి విధులు నిర్వహించుకోవచ్చు. పిల్లల సంరక్షణ బాధ్యతను అక్కడి సిబ్బంది చూసుకుంటారు. 

మరిన్ని వార్తలు