'డొనేట్-ఏ-పెన్షన్' కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి

7 Mar, 2022 19:19 IST|Sakshi

కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ నేడు(ఫిబ్రవరి 07) ప్రధానమంత్రి శ్రమ ఆధ్వర్యంలో 'డొనేట్-ఏ-పెన్షన్' కార్యక్రమాన్ని ప్రారంభించారు. అసంఘటిత రంగాల కార్మికుల కోసం పెన్షన్ నిధిని సృష్టించడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ట్వీట్ చేస్తూ.. "తోటమాలికి విరాళం ఇవ్వడం ద్వారా నా నివాసంలో 'డొనేట్-ఎ-పెన్షన్' కార్యక్రమాన్ని ప్రారంభించాను. పీఎం ఎస్‌వైఎం పెన్షన్ పథకం కింద ఒక చొరవ, ఇక్కడ పౌరులు గృహ కార్మికులు, డ్రైవర్లు, సహాయకులు మొదలైన వారి తక్షణ సహాయక సిబ్బందికి ప్రీమియం కంట్రిబ్యూషన్'ను విరాళంగా ఇవ్వవచ్చు"అని అన్నారు.

కార్మిక మంత్రిత్వ శాఖ ఇలా.. "డొనేట్-ఎ-పెన్షన్ పథకానికి చిన్న సహకారం అందించడం ద్వారా అసంఘటిత కార్మికుల భవిష్యత్తును సురక్షితం చేయండి. ఈ రోజు  పీఎం ఎస్‌వైఎం కింద ప్రారంభించిన ఒక గొప్ప కార్యక్రమం, ఇది పెద్ద తేడాను కలిగిస్తుంది" అని ట్వీట్ చేసింది.

పీఎం ఎస్‌వైఎం
ఇదొక పెన్షన్ పథకం పేదలను, ఆదాయం తక్కువగా ఉన్న కార్మికులను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం "ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన" పేరుతో ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. 18 సంవత్సరాల వయసు గల వారి నుండి 40 సంవత్సరాల వయసు గల వారు ఈ పథకానికి అర్హులు. పథకాన్ని ఎనుకున్న వ్యక్తి/ వ్యక్తురాలు వయసును బట్టి మీరు చెల్లించాల్సిన మొత్తం ఆధారపడి ఉంటుంది.  ఈ పథకంలో మీరు నెలకు రూ.55 చెల్లిస్తే 60 సంవత్సరాలు దాటిన తరువాత నెలకు రూ. 3 వేల చొప్పున సంవత్సరానికి 36 వేల రూపాయలు మీకు లభిస్తాయి. అన్ని రకాల సాధారణ సేవా కేంద్రాల ద్వారా  ఈ పథకంలో చేరవచ్చు అంతేకాకుండా దేశంలోని ప్రతి రాష్ట్రాలలో ఈ పథకం అందుబాటులో ఉంటుంది. 

(చదవండి: జాక్‌పాట్‌!! అమెరికా ప్రెసిడెంట్‌గా ఎలన్‌ మస్క్‌?)

మరిన్ని వార్తలు