బెజోస్‌,మస్క్‌ సరే! మరి అదానీ, అంబానీ సంపద మాట ఏంటి?

14 Sep, 2022 17:14 IST|Sakshi

సాక్షి,ముంబై: అమెరికాలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం  కారణంగా అక్కడి బిలియనీర్లు బిలియన్‌ డాలర్ల సంపదను కోల్పోతున్నారు.  టాప్‌ 10లో ఉన్న అక్కడి బిలియనీర్ల సంపదకు ఈ ఏడాది గడ్డుకాలంగా నిలుస్తోంది.ఒక్క జులై మినహా ఈ ఏడాది ఆరంభం నుంచి అమెరికా మార్కెట్  భారీ నష్టాలను చవిచూస్తోంది. ఫలితంగా ఈ ఏడాది తొలి అర్దభాగంలో ప్రపంచ కుబేరులు 1.4 ట్రిలియన్ డాలర్ల మేర నష్టపోయారు.

ఫెడ్‌ వడ్డీరేటు తప్పదనే భయాలు ఇన్వెస్టర్లనువెంటాడుతున్నాయి. ఫలితంగా S&P 500 జూన్ 2020 నుండి అత్యధికంగా 4.4 శాతం, టెక్-హెవీ నాస్‌డాక్ 100 ఇండెక్స్ 5.5శాతం కుప్పకూలింది. ఫెడరల్ రిజర్వ్ చైర్ జెరోమ్ పావెల్ ఎనిమిది నిమిషాల ప్రసంగం తర్వాత బిలియనీర్ల సంపద ఒక రోజులో 78 బిలియన్‌ డాలర్ల  కోల్పోయింది. అదే భయం ఇప్పటికీ కొనసాగుతోంది.  అయితే దేశీయ వ్యాపార దిగ్గజాలు, ఆసియా కుబేరులు సంపద మాత్రం చెక్కు చెదరకుండా ఉండటం గమనార్హం.  (బెజోస్‌ నుంచి మస్క్‌ దాకా, ప్రపంచ బిలియనీర్లకు భారీ షాక్‌)

గ్లోబల్‌ బిలియనీర్ల జాబితా టాప్‌-10 లో  ఒక్క రోజులొ సంపదను కోల్పోని  బిలియనీర్లు ఇద్దరు మాత్రమే. వారే రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్‌ అంబానీ ,గౌతమ్ అదానీ.బ్లూమ్‌బర్గ్‌ ఇండెక్స్ ప్రకారం దేశవ్యాప్తంగా దీపావళి నాటికి తన స్వతంత్ర 5జీ సేవలను ప్రారంభించబోతున్న అంబానీ 9,775 కోట్లు సంపాదించారు. మరోవైపు ప్రస్తుతం ప్రపంచంలో మూడో అత్యంత సంపన్నుడిగా ఉన్న అదానీ గ్రూపు అధినేత గౌతం అదానీ 12,556 కోట్లు (1.58 బిలియన్ డాలర్లు ) సంపాదించడం విశేషం. ముఖ్యంగా టాప్‌లో ఉన్న అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌, టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ ఇద్దరూ గత 24 గంటల్లో లక్షా 50 వేల కోట్ల మేర సంపదను కోల్పోయిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు