భారత మార్కెట్‌లోకి లంబోర్ఘిని కొత్త కారు విడుదల..ధర ఎంతంటే.. 

15 Jul, 2021 21:05 IST|Sakshi

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని భారత మార్కెట్‌లోకి హురాకాన్ ఎస్‌టిఓ కారును విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా హురాకాన్‌ ఎస్‌టీ​ఓను నవంబర్‌ 2020లోనే రిలీజ్‌ చేయగా,  హురాకాన్‌ ఎస్టీఓ ప్రస్తుతం ఉన్న హురాకాన్‌ పెర్ఫార్మంటే కారును రిప్లెస్‌ చేయనుంది. ఈ కారు బాడీ తయారీలో సుమారు 75 శాతం వరకు కార్బన్‌ ఫైబర్‌ను వినియోగించారు. లంబోర్ఘిని హురాకాన్‌ ఎస్‌టీవోలో వీ10 ఇంజన్‌ ఏర్పాటు చేశారు.  630 బీహెచ్‌పీ సామర్థ్యంతో 565ఎన్‌ఎమ్‌ టార్క్‌ను ఉత్సత్తి చేస్తోంది.


సున్నా నుంచి 100 స్పీడ్‌ను కేవలం మూడు సెకండ్లలోనే అందుకుంటుంది. కారు 200కెఎమ్‌పీచ్‌ స్పీడ్‌ను తొమ్మిది సెకండ్లలో అందుకుంటుంది. కారు టాప్‌ స్పీడ్‌ 310కేఎమ్‌పీహెచ్‌. కారులో మూడు రకాల డ్రైవింగ్‌ మోడ్స్‌ను అమర్చారు. ది రోడ్‌ ఒరియంటెడ్‌ ఎస్‌టీవో, ట్రాక్‌ ఫోకస్డ్‌ ట్రోఫీ, రెయిన్‌ మోడ్‌లను అమర్చారు.
 

కార్ ఇంటీరియర్స్‌ విషయానికి వస్తే.. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లో భాగంగా కొత్త హ్యూమన్ మెషిన్ ఇంటర్‌ఫేస్ (హెచ్‌ఎంఐ) గ్రాఫిక్స్ ఫీచర్స్‌ను అమర్చారు. అంతేకాకుండా కారులో డ్రైవ్ మోడ్ ఇండికేటర్, ఎల్‌డివిఐ సిస్టమ్, టైర్ ప్రెజర్,  బ్రేక్ ఉష్ణోగ్రతలతో సహా కారు విధులను నిర్వహిస్తుంది. పూర్తిగా అనుసంధానించబడిన టెలిమెట్రీ వ్యవస్థతో డ్రైవర్లు హురాకాన్ STO ను రేస్ట్రాక్‌లపై  రయ్‌రయ్‌మంటూ దూసుకువెళ్లొంచును. భారత్‌లో లంబోర్ఘిని హురాకాన్‌ ఎస్‌టీవో ఎక్స్‌షోరూమ్‌ ధర రూ. 4.99 కోట్లుగా నిర్ణయించారు.

మరిన్ని వార్తలు