జియో క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్స్‌‌: అప్పటి వరకు మాత్రమే..

18 Feb, 2021 19:51 IST|Sakshi

న్యూఢిల్లీ : ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్‌ జియో తమ కస్టమర్ల కోసం సరికొత్త క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్స్‌ను అందుబాటులోకి తెచ్చింది.  పేటీఎమ్‌, ఫోన్‌ పే, అమెజాన్‌, మోబీక్విక్‌, ఫ్రీఛార్జ్‌ యాప్‌ల ద్వారా రిఛార్జ్‌ చేసుకునేవారికి క్యాష్‌‌ బ్యాక్‌ ఆఫర్స్‌ కింద 100 రూపాయల నుంచి 1000 రూపాయల దాకా రివార్డులు అందించనుంది. ఫిబ్రవరి 16వ తేదీన ప్రారంభమైన ఈ ఆఫర్‌ 28 వరకు మాత్రమే ఉంటుంది. ( మొబైల్ యూజర్లకు బ్యాడ్ న్యూస్ )

పేటీఎమ్‌ 
జియోలోకి కొత్తగా ప్రవేశించిన కస్టమర్లు పేటీఎమ్‌ ద్వారా రీఛార్జ్‌ చేసుకున్నట్లయితే మూడుసార్లు 100 రూపాయల చొప్పున కచ్చితమైన క్యాష్‌‌ రివార్డు పొందొచ్చు. అదే పాత కస్టమర్లు అయితే 1000 రూపాయల దాకా క్యాష్‌‌ రివార్డులు గెలుచుకునే అవకాశం ఉంది. ఇందుకోసం కనీసం రూ. 48 రూపాయల విలువ గల రిఛార్జ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

ఫోన్‌పే
ఫోన్‌పే ద్వారా రిఛార్జ్‌ చేసుకునే జియో కొత్త కస్టమర్లకు రూ. 140 దాకా క్యాష్‌ బ్యాక్‌తో పాటు ఓ స్క్రాచ్‌ కార్డ్‌ వస్తుంది. వీటి ద్వారా రూ.260 విలువ గల క్యాష్‌ రివార్డులను పొందొచ్చు. పాత కస్టమర్లు అయితే మొదటి రీఛార్జ్‌ కింద రూ.120 పొందొచ్చు. అది కూడా యూపీఐ ఐడీ ద్వారా రీఛార్జ్‌ చేస్తేనే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. ఈ ఆఫర్‌ను పొందటానికి కనీసం రూ.125 విలువ గల రీఛార్జ్‌ చేసుకోవాల్సి  ఉంటుంది. 

అమెజాన్‌ 
అమెజాన్‌ ద్వారా రీఛార్జ్‌ చేసుకున్నట్లుయితే రూ. 125 క్యాష్‌ రివార్డు పొందొచ్చు. ఈ ఆఫర్‌ పాత, కొత్త కస్టమర్లకు ఒకేలా వర్తిస్తుంది. ఈ రివార్డులను అమెజాన్‌ షాపింగ్‌ కోసం వాడుకోవచ్చు. 

మోబీక్విక్‌ 
ఈ యాప్‌ ద్వారా మీరు రూ. 149 అంతకంటే ఎక్కువ విలువ గల రిఛార్జ్‌ చేసుకుంటే 5 శాతం క్యాష్‌ బ్యాక్‌ పొందొచ్చు. గరిష్టంగా రూ. 50 క్యాష్‌ బ్యాక్‌ పొందే అవకాశం ఉంది. కొత్త కస్టమర్లు ఈ ఆఫర్‌ను పొందటానికి ‘NJI050’ కోడ్‌ని ఎంటర్‌ చేయాలి. పాత కస్టమర్లు అయితే రిఛార్జ్‌ మొత్తంలో 50 శాతం క్యాష్‌ బ్యాక్‌ పొందే అవకాశం ఉంది. గరిష్టంగా రూ. 100 రూపాయల వరకు క్యాష్‌ బ్యాక్‌ పొందుచ్చు. ఇందుకోసం ‘JIO50P’ కోడ్‌ను ఎంటర్‌ చేయాలి.

ఫ్రీఛార్జ్‌ 
ఫ్రీఛార్జ్‌ ద్వారా కొత్త జియో కస్టమర్లు రూ.30.. పాత కస్టమర్లు రూ. 20 క్యాష్‌‌ బ్యాక్‌ పొందే అవకాశం ఉంది. ఇందుకోసం ‘JIO30’... ‘JIO20’ కోడ్‌లు ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు