వాట్సప్ ఓటీపీతో జర జాగ్రత్త!

24 Nov, 2020 13:22 IST|Sakshi

ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ మెసేజింగ్ యాప్ కి ఎక్కువ మంది వినియోగదారులున్నారు. అందుకే ప్రస్తుతం హ్యాకర్లు వాట్సాప్ వినియోగదారులను ఎంచుకొంటూ కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. మీ వాట్సాప్‌లోని ముఖ్యమైన, సున్నితమైన డేటాను సేకరించడానికి హ్యాకర్లు వాట్సాప్ ‌కు వచ్చే ఓటీపీని మార్గంగా ఎంచుకుంటున్నారు. దీనివల్ల మీ వాట్సాప్ అకౌంట్ లోకి సులభంగా ప్రవేశించడంతో పాటు కీలకమైన సమాచారాన్ని చోరీ చేస్తున్నారు. 

ఏంటీ ఓటీపీ స్కాం

వాట్సాప్ ఓటీపీ స్కాంలో భాగంగా.. మీకు మీ స్నేహితుడి పేరుతో తెలియని నంబర్‌ నుంచి మెసేజ్‌ వస్తుంది. తన ఫోన్‌‌ నెంబర్ పనిచేయడంలేదని.. వాట్సాప్‌ ఖాతా వేరే ఫోన్‌లో ఉపయోగించేందుకు ఓటీపీ కోసం నీ ఫోన్‌ నంబర్‌ ఇచ్చానని.. ఆ ఓటీపీని తనకు పంపించాలని దాని సారాంశం. మీరు ఓటీపీని పంపడం కోసం మీ స్నేహితుడికి ఫోన్ చేస్తే నా ఫోన్ బాగానే చేస్తుందని చెప్పడంతో పాటు, నేను ఎవరికీ నా నెంబర్ ఇవ్వలేదని చెప్పడంతో మీరు ఆశ్చర్యపోతారు. మీరు కనుక వెంటనే వాట్సాప్ హెల్ప్ లైన్ నెంబర్ కి ఫోన్ చేస్తే అది స్కాం అని తెలుస్తుంది. అందుకోసమే మీకు వేరే నెంబర్ నుండి ఓటీపీ వస్తే ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. (చదవండి: వన్‌ప్లస్ 9ప్రో డిజైన్ ఫస్ట్ లుక్

ఒక వేల మీరు ఓటీపీ కోడ్‌ను హ్యాకర్‌కు పంపితే, మీ మిత్రుడు తన స్వంత వాట్సాప్ ఖాతాకు తిరిగి లాగిన్ కాలేరు. అప్పుడు మీ మిత్రుడి ఖాతాపై పూర్తి నియంత్రణ హ్యాకర్ చేతికి వెళ్తుంది. వెంటనే మీ మిత్రుడి ఖాతాలోని ముఖ్యమైన సమాచారాన్ని చోరీ చేయడంతో పాటు మిమ్మల్ని డబ్బులు కూడా అడిగే అవకాశం ఉంది. మళ్ళీ ఇదేవిదంగా మీ ఇతర స్నేహితుల ఖాతాలను కూడా హ్యాక్ చేయవచ్చు. అందుకని మనం, మనకు తెలియని నెంబర్ నుండి ఎటువంటి సందేశం వచ్చిన స్పందించకపోవడం మంచిది. అలానే మీ వాట్సాప్‌ ఖాతాకు టూ-స్టెప్‌ వెరిఫేకేషన్‌ను ఎనేబుల్ చేసుకోవడం చాలా మంచిది. దాని వల్ల ఓటీపీతో పాటు ఖాతా వెరిఫికేషన్‌కి ప్రత్యేక పిన్‌ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని వల్ల పొరపాటున మీరు ఓటీపీ పంపినా పిన్‌ నంబరు ఉండదు కాబట్టి మీ ఖాతాను హ్యాక్‌ చేయలేరు. ఒక వేళ ఓటీపీ పంపి మీ ఖాతా హ్యాక్ అయితే వెంటనే మీ వాట్సాప్‌ని రీసెట్ చేసి తిరిగి లాగిన్ అవ్వండి.   

మరిన్ని వార్తలు