ఫ్యూచర్‌ వివాదంపై ఎన్‌సీఎల్‌ఏటీకి అమెజాన్‌

10 Jan, 2022 08:49 IST|Sakshi

‘గ్రో’లో ఇన్వెస్టరుగా మైక్రోసాఫ్ట్‌ సత్య నాదెళ్ల 

న్యూఢిల్లీ: ఫిన్‌ టెక్‌ సంస్థ ’గ్రో’లో తాజాగా ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల ఇన్వెస్ట్‌ చేయడంతో పాటు సలహాదారుగా కూడా చేరారు. గ్రో సహ వ్యవస్థాపకుడు, సీఈవో లలిత్‌ కేస్రి ఈ విషయం తెలిపారు. అయితే, సత్య ఎంత ఇన్వెస్ట్‌ చేసినదీ మాత్రం వెల్లడించలేదు. 

స్టాక్స్, ఫండ్స్‌ మొదలైన వాటిల్లో పెట్టుబడులు పెట్టేందుకు తోడ్పడే గ్రో 2017లో కార్యకలాపాలు ప్రారంభించింది. గతేడాది అక్టోబర్‌లో 1 బిలియన్‌ డాలర్ల వేల్యుయేషన్‌తో 251 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 1,885 కోట్లు) సమీకరించింది. తాజా విడతలో అల్కియోన్, లోన్‌ పైన్‌ క్యాపిటల్, స్టెడ్‌ఫాస్ట్‌ సహా ప్రస్తుత ఇన్వెస్టర్లయిన సెకోయా క్యాపిటల్, రిబిట్‌ క్యాపిటల్, వైసీ కంటిన్యుటీ, టైగర్‌ గ్లోబల్, ప్రొపెల్‌ వెంచర్‌ మొదలైనవి కూడా పెట్టుబడులు పెట్టాయి.  

చదవండి: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ వర్సెస్‌ అమెజాన్‌.. కోర్టుకు చేరిన పంచాయితీ

మరిన్ని వార్తలు