వావ్‌.. రూ.10వేలకే బోలెడు ఫీచర్లతో 5జీ స్మార్ట్‌ఫోన్‌!

5 Oct, 2022 16:19 IST|Sakshi

దేశంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 5జీ(5G) సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. కంపెనీలు కూడా కస్టమర్లకు 5జీ అధునాతన టెక్నాలజీ సర్వీసును అందించే క్రమంలో బిజీ అయ్యాయి. అయితే కొన్ని మొబైల్స్‌కి మాత్రం ఈ 5జీ టెక్నాలజీ సపోర్ట్‌ చేయదన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో మొబైల్‌ తయారీ కంపెనీలు తక్కువ ధరకే 5జీ సేవలు అందించే స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహులు చేస్తున్నాయి. 

ఈ క్రమంలో రూ. 10వేలకే 5జీ మొబైల్‌ తీసుకురానున్నట్లు ఇండియన్‌ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్‌ ప్రకటించింది. న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరిగిన ఐఎంసీ 2022 ఈవెంట్‌లో లావా బ్లేజ్‌ (Lava Blaze 5G)ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా మార్కెట్లో దొరికే 5జీ ఫోన్లలో ఇదే అతి చౌకైందని, ఈ దీపావళికి ప్రీబుకింగ్స్‌తో కస్టమర్లకు ముందుకు వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. 

త్వరలో మార్కెట్లో విడుదల కాబోతున్న ఈ బడ్జెట్ 5G ఫోన్‌ కీలక ఫీచర్లు ఇవే!
►5G సపోర్ట్‌ స్మార్ట్‌ఫోన్‌,
► మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్‌సెట్,  
►1600×720 పిక్సెల్స్ HD+ రిజల్యూషన్‌తో 6.5 ఇంచెస్‌ LCD స్క్రీన్,
►90Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్

►5000mAh బ్యాటరీ, బ్లూ, గ్రీన్ కలర్స్‌
► 50mp రియర్‌ కెమెరా, 8 mp ఫ్రంట్‌ కెమెరా
►4GB RAM, 128GB  
►5000mAh బ్యాటరీ లాంటి ఫీచర్లు ఉన్నాయు

చదవండి: Airtel 5g: ఎయిర్‌టెల్‌ యూజర్లకు భారీ షాక్‌! ఈ ఫోన్‌లలో 5జీ పనిచేయడం లేదంట!

మరిన్ని వార్తలు