మరోసారి బ్రేకులు, వీడియోకాన్‌ టేకోవర్‌పై స్టే

20 Jul, 2021 08:24 IST|Sakshi

న్యూఢిల్లీ: దివాలా ప్రక్రియ కింద వేలానికి వచ్చిన వీడియోకాన్‌ను ట్విన్‌ స్టార్‌ టెక్నాలజీస్‌ టేకోవర్‌ చేసే ప్రయత్నాలకు బ్రేక్‌ పడింది. దీనిపై జాతీయ కంపెనీ లా అపీలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) స్టే విధించింది. రుణ దాతల కమిటీ (సీవోసీ) నిర్ణయంపై అసంతృప్తిగా ఉన్న బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, ఐఎఫ్‌సీఐ దాఖలు చేసిన పిటీషన్లపై ఎన్‌సీఎల్‌ఏటీ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. వీటిపై తమ సమాధానాలను రెండు వారాల్లోగా సమర్పించాలని సీవోసీ, పరిష్కార నిపుణుడు, ట్విన్‌ స్టార్‌కు సూచించింది. తదుపరి విచారణను సెప్టెంబర్‌ 7కు వాయిదా వేసింది. బ్యాంకులకు సుమారు రూ. 64,838 కోట్లు బాకీపడి, వేలానికి వచ్చిన వీడియోకాన్‌ను దాదాపు రూ. 2,962 కోట్లకు కొనుగోలు చేసేందుకు ట్విన్‌ స్టార్‌ టెక్నాలజీస్‌ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనికి అనుమతిస్తూ జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ఉత్తర్వులు ఇచ్చింది.   

మరిన్ని వార్తలు