Layoffs: మెటాలో మళ్లీ లేఆఫ్స్‌! నిజమేనా?

23 Feb, 2023 15:02 IST|Sakshi

సోషల్‌ మీడియా టెక్‌ దిగ్గజం ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ మెటా మళ్లీ లేఆఫ్‌ అమలు చేయనుందని వార్త ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇదే కంపెనీ గత నవంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా 11వేల మందిని తొలగించింది. ఇది ఆ సంస్థ మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 13 శాతం. ఎక్కువ మందిని నియమించుకోవడం, ఆర్థిక మందగమనాన్ని అందుకు కారణంగా అప్పట్లో యాజమాన్యం పేర్కొంది.

తాజాగా అవే కారణాలను చూపుతూ మరో విడత లేఆఫ్స్‌ అమలు చేయనుందని వాషింగ్‌టన్‌ పోస్ట్‌ ఓ కథనం వెలువరించింది. పలు విభాగాల్లో ఉద్యోగుల తొలగింపులు ఉంటాయని పేర్కొంది. అయితే ఇవి ఒకే సారి కాకుండా దశలవారీగా ఉండొచ్చని అభిప్రాయపడింది. కంపెనీ రెవెన్యూ నాలుగో త్రైమాసికంలో తగ్గిపోవడం, ఉద్యోగుల పనితీరు సమీక్ష సందర్భంగా వేలాది మందికి అధమ రేటింగ్‌ ఇచ్చిన నేపథ్యంలో లేఆఫ్స్‌ ఉండొచ్చని ఊహాగానాలు ఉన్నాయి. అంతే కాకుండా కంపెనీలో ఉన్నత ఉద్యోగులను కొంతమందిని కింది స్థాయి ఉద్యోగాలకు పరిమితం చేయనున్నట్లు వాషింగ్‌టన్‌ పోస్ట్‌ వివరించింది.

(ఇదీ చదవండి: US Visa: మరింత తొందరగా అమెరికన్‌ వీసా.. భారతీయులకు అధిక ప్రాధాన్యత!)

అయితే ఈ కథనాన్ని మెటా కంపెనీ ఖండించింది. కంపెనీ కమ్యూనికేషన్స్‌ హెడ్‌ యాండీ స్టోన్‌ వాషింగ్‌టన్‌ పోస్ట్‌ కథనంపై ట్విటర్‌ ద్వారా అసహనం వ్యక్తం చేశారు. వైరుధ్య కథనాలను పదేపదే ఎలా ప్రచురిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు